/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Hair Mask For Hair Growth: ప్రస్తుతం మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపుడుతున్నారు. అయితే చాలా మంది జుట్టు రాలిపోవడం సమస్యల బారిన పడడం విశేషం. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది జుట్టుకు వివిధ రకాల రెమెడీస్‌ని వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్‌ పెట్టడానికి కొన్ని ఇంటి నివారణలు వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వీటిని వినియోగించడం వల్ల జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉండానికి పలు రకాల చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బిల్వ పత్రాలు ప్రయోజనాలు:

బిల్వ పత్రాలు, కొబ్బరి నూనె:
వెంట్రుకలకు బిల్వ పత్రాలతో చేసిన మాస్క్‌ను వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఎండబెట్టి పొడిలా చేసుకుని..ఈ పొడిలో కొబ్బరి నూనె మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడవుగా మారుతుంది.

బిల్వ పత్రాలు, మెంతులు:
ఈ రెసిపీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా కనిపించడానికి బిల్వ పత్రాలు, మెంతులతో చేసిన మాస్క్‌ను వినియోగించవచ్చు. అయితే దీని కోసం మెంతులు,పెరుగు, బిల్వ పత్రాలను మిక్స్‌ చేసి గ్రైడ్‌ చేయాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా కనిపిస్తుంది.

బిల్వ పత్రాలు, జీలకర్ర:
బిల్వ పత్రాలను మెత్తగా గ్రైడ్‌ చేసి అందులో  ఒక చెంచా జీలకర్ర పొడిని వేసి.. అందులోనే 2 స్పూన్లు  కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని జుట్టుకు క్రమం తప్పకుండా పట్టించడం వల్ల జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మారుతుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hair Mask For Hair Growth: Coconut Oil Mixed With Bilva Leaves And Applied To Hair Will Make Hair Stronger From Roots
News Source: 
Home Title: 

Hair Mask: జుట్టుకు క్రమం తప్పకుండా ఇలా  చేయడం వల్ల.. కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి.. 

Hair Mask: జుట్టుకు క్రమం తప్పకుండా ఇలా  చేయడం వల్ల.. కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి..
Caption: 
Hair Mask For Hair Growth: Coconut Oil Mixed With Bilva Leaves And Applied To Hair Will Make Hair Stronger From Roots(Souce: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జుట్టు బలంగా మారేందుకు..

బిల్వ పత్రాలు, కొబ్బరి నూనె మిశ్రమాన్ని వినియోగించాలి.

ఇలా చేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి.

Mobile Title: 
జుట్టుకు క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల.. కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, September 15, 2022 - 16:56
Request Count: 
35
Is Breaking News: 
No