Detox Drinks For Weight Loss At Home: డిటాక్స్ డ్రింక్స్ శరీరాన్ని హెల్తీగా ఉంచడమేకాకుండా జీవక్రియ శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే మూలకాలు బరువును కూడా తగ్గిస్తాయి. అయితే ప్రతి రోజూ ఆహారం తీసుకున్న తరువాత కానీ, ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్‌గా ఉంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ డ్రింక్స్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ డ్రింక్స్ తీసుకోవాలి.
నిమ్మకాయ, దోసకాయతో చేసిన డిటాక్స్ వాటర్:
బరువును సులభంగా తగ్గాలనుకునే వారు తప్పకుంగా ఈ నిమ్మకాయ, దోసకాయతో చేసిన డిటాక్స్ వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం.. చిటికెడు ఉప్పు తీసుకుని, కొన్ని పుదీనా ఆకులతో ఒక జార్ నీటిలో వీటిని వేసుకుని కలుపుకోవాలి. అయితే ఇలా తయారు చేసిన డ్రింక్‌ను రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే బరుపు సులభంగా తగ్గుతారు.
ఈ డ్రింక్‌ను ఉదయం పూట తాగండి:
ఒక గ్లాస్‌లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంతో పాటు.. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు కలుపుకుని..అందులోనే 1 టేబుల్ స్పూన్ మాపుల్ సిరప్, తగినంత ఉప్పు వేసుకుని కలిపి ఈ డ్రింక్‌ను తాగితే శరీరానికి మంచి ప్రయోజనాలు లభించడమేకాకుండా బరువు సులభంగా తగ్గుతారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెడుతుంది.
యాపిల్, నిమ్మరసం జ్యూస్:
బరువును సులభంగా తగ్గాలనుకునేవారు తప్పకుండా ఇలా యాపిల్, నిమ్మరసం చేసిన జ్యూస్ తాగితే.. శరీరం యాక్టివ్‌గా ఉండడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి రోజూ ఉదయం పూట ఈ డ్రింక్‌ను తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
ఆరెంజ్, క్యారెట్ జ్యూస్:
క్యారెట్, నారింజతో పాటు కొన్ని కొత్తిమీర ఆకులు బ్లైండ్ చేసి.. వాటిని ఒక గ్లాసులో పోసి పైన ఐస్ వేసి తీసుకుంటే బరువు నియంత్రణలో ఉండడమేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగాలని నిపుణులు తెలుపుతున్నారు.
టొమాటో, దోసకాయ రసం:
బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఆహారాలతో పాటు టొమాటో, దోసకాయ చేసిన రసం తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అయితే దీని కోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకుని, అందులో టొమాటో, దోసకాయ ముక్కలను తీసుకుంటే శరీర బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: ఓటీటీకి సిద్దమైన 'కార్తికేయ 2'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
Also Read: షమీ, చహర్‌లకు షాక్.. డీకేకు చోటు! టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.