Viral Video of a Man Survives after Train Passes Over him: అదృష్టమంటే ఇతనిదే. రైలు ఎక్కబోయి పట్టాలపై పడిపోయినా.. ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు వెళ్లిపోయాక బతుకు జీవుడా అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతూ పైకి లేచాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఇతవహ్ జిల్లాలో ఉన్న భర్తాన రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వ్యక్తి పేరు, వివరాలు తెలియదు కానీ ఇటీవల ఓరోజు ఇంటర్‌సిటీ ట్రైన్ ఎక్కేందుకు భర్తానా రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు. అప్పటికే ప్లాట్‌ఫామ్‌పై రద్దీ ఎక్కువగా ఉంది. రైలు ప్లాట్‌ఫామ్ పైకి రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసేసుకున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు. అప్పటికే రైలు కదిలింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు పట్టాల వైపే చూస్తూ ఉండిపోయారు. అతనికేమై ఉంటుందోనని టెన్షన్ పడ్డారు.
కానీ రైలు అలా వెళ్లగానే ఆ వ్యక్తి పట్టాల పైనుంచి లేచి నిలుచున్నాడు. చిన్న గాయం కూడా కాకుండా నిక్షేపంగా ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరించాడు. ఆపై చెల్లాచెదరుగా పడిన తన బ్యాగ్‌ను సర్దుకుని ప్లాట్‌ఫామ్ పైకి చేరుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.. రైలు పట్టాలకు, ప్లాట్‌ఫామ్‌కి మధ్య ఉన్న గ్యాప్‌లో ఇరుక్కుని.. రైలు వెళ్లేంతవరకూ అతను అలానే ఉండిపోయాడు. ఈ ఘటన రైల్వే ప్రయాణికులను ఆశ్చర్యపోయేలా చేసింది. అతను ప్రాణాలతో బయటపడటం నిజంగా మిరాకిల్ అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video : Train passed over a man at Bharthana railway station in Etawah as death..., watch breath-taking video pic.twitter.com/eHtn1LcN1A
— santosh singh (@SantoshGaharwar) September 6, 2022
Also Read: KCR National Politics: గూట్లో రాయి తీయలేనోడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఈటల సెటైర్స్...
Also Read: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook