Pitbull Attack on Boy: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పిట్‌బుల్ జాతికి చెందిన ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. పార్క్‌లో ఆడుకుంటున్న సమయంలో బాలుడి పైకి ఎగబడ్డ కుక్క.. గోళ్లతో రక్కి, పళ్లతో కొరికి అతని ముఖాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చేరగా.. అతని ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఘజియాబాద్‌లోని సంజయ్ నగర్లో తమ ఇంటికి సమీపంలో ఉండే పార్క్‌లో ఆడుకునేందుకు ఆ బాలుడు వెళ్లాడు. అదే సమయంలో లలిత్ త్యాగి అనే వ్యక్తి పిట్‌బుల్ డాగ్‌ను తీసుకుని పార్క్‌కి వచ్చాడు. పార్క్‌లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ కుక్క అతని నుంచి తప్పించుకుని.. అక్కడే ఆడుకుంటున్న బాలుడిపై పడి దాడి చేసింది. అతన్ని కింద పడేసి గోళ్లతో రక్కేసింది. పళ్లతో కొరికేసింది.
ఆసుపత్రిలో చేరిన బాలుడు 4 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జి అయ్యాడు. ముఖమంతా గాయాలతో అతని రూపమే మారిపోయింది. సెప్టెంబర్ 3న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు కుక్క యజమానికి స్థానిక అధికారులు రూ.5 వేలు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కుక్క దాడిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కుక్కలను తీసుకుని బయటకొచ్చేవారు వాటి నోటికి టేపు అంటించాలని సూచిస్తున్నారు.
3/9/22: A 10-year-old boy playing in the Ghaziabad park was attacked by a dog of Pitbull breed on last saturday, The child necessitating more than 100 stitches on his face. The kid is not able to talk.
CCTV footage surfaces. pic.twitter.com/QcZ0nYl3ZM— Muktanshu (@muktanshu) September 8, 2022
Also Read: Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook