Parivartini Ekadashi 2022: ఇవాళే పరివర్తిని ఏకాదశి, శుభ ముహూర్తం, పూజా విధానం, వ్రత ప్రాముఖ్యత

Parivartini Ekadashi 2022: పరివర్తిని ఏకాదశి వ్రతం ఇవాళ అంటే మంగళవారం సెప్టెంబర్ 6, 2022 నాడు జరుపుకోనున్నారు. ఈ వ్రత ప్రాముఖ్యత, పూజా విధానం తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2022, 11:07 AM IST
Parivartini Ekadashi 2022: ఇవాళే పరివర్తిని ఏకాదశి, శుభ ముహూర్తం, పూజా విధానం, వ్రత ప్రాముఖ్యత

Parivartini Ekadashi Vrat 2022 Puja Time: ఇవాళ అంటే సెప్టెంబరు 6, మంగళవారం పరివర్తిని ఏకాదశి. ఈ రోజున శ్రీమహావిష్ణువు (Lord vishnu) నిద్రలో తనవైపు మార్చుకుంటాడు. అందుకే దీనిని పరివర్తినీ ఏకాదశి అని పిలుస్తారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పరివర్తినీ లేదా జలజుల్ని లేదా పద్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి (Parivartini Ekadashi Vrat 2022) ఉపవాసం చాలా కష్టమైనది. ఈ రోజు శ్రీహరి యెుక్క వామన అవతారాన్ని పూజిస్తారు. ఈ వ్రతం చేస్తే వాజపేయ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 

ఈ ఏడాది పరివర్తినీ ఏకాదశి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజున చాలా పవిత్రమైన శుభయోగం ఏర్పడుతుంది. ఈ యోగంలో శ్రీమహావిష్ణువును పూజిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి. పరివర్తిని ఏకాదశి వ్రతం శుభ ముహూర్తం, యోగం, పూజా విధానం గురించి తెలుసుకుందాం. 

పరివర్తిని ఏకాదశి శుభ ముహూర్తం
భాద్రపద శుక్ల పక్ష ఏకాదశి తేదీ ప్రారంభం - 06 సెప్టెంబర్ 2022, ఉదయం 05.54 
భాద్రపద శుక్ల పక్ష ఏకాదశి తేదీ ప్రారంభం - 07 సెప్టెంబర్ 2022, ఉదయం 03.04
వ్రత పారణ సమయం - ఉదయం 08.19  - ఉదయం 08.33 (7 సెప్టెంబర్ 2022)
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:37  - ఉదయం 05:23
అభిజిత్ ముహూర్తం -మధ్యాహ్నాం 12:00 - 12:50 
సంధ్య ముహూర్తం - సాయంత్రం 06:29 - 06:53 
అమృత కాలం - మధ్యాహ్నం 01:45- 03:13

శుభ యోగం
పరివర్తిని ఏకాదశి నాడు సూర్యుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలు తమ తమ సొంతరాశులలో ఉండటం విశేషం. దీంతోపాటు ఈరోజు నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. 
రవి యోగం- ఉదయం 06:08- సాయంత్రం 06:09 (సెప్టెంబర్ 6, 2022)
త్రిపుష్కర యోగా - ఉదయం 03:04 - ఉదయం 06:09 (7 సెప్టెంబర్ 2022)
ఆయుష్మాన్ యోగా - 5 సెప్టెంబర్ 2022, ఉదయం 11:28 - 6 సెప్టెంబర్ 2022, ఉదయం 08:16
సౌభాగ్య యోగా - 6 సెప్టెంబర్ 2022, ఉదయం 08:16- 7 సెప్టెంబర్ 2022, ఉదయం 04:50

పరివర్తిని ఏకాదశి పూజ విధానం
>> పరివర్తిని ఏకాదశి నాడు ఉదయాన్నే గంగాజలంతో స్నానం చేసి.. విష్ణుమూర్తి చిత్రపటం ఈరోజు ఉపవాసం చేస్తానని వాగ్దానం చేయండి. 
>> అనంతరం పూజా పీఠంపై పసుపు వస్త్రాన్ని కప్పండి. అనంతరం శ్రీహరి వామన అవతార చిత్రపటాన్ని పెట్టి పూజలు చేయండి. ఏకాదశి మంగళవారం కావడంతో విష్ణువును పూజించిన తర్వాత హనుమంతుడిని కూడా పూజించండి.
>> శ్రీహరికి పసుపు చందనం, పసుపు పుష్పాలు, తులసి పప్పు, పసుపు రంగు వంటకాలు పెట్టండి. మహావిష్ణువు విగ్రహానికి చేసే పూజలో ముందుగా శంఖానికి నీరు, పాలు, పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత షోడోపచారాలతో పూజలు చేయండి. 
>> పూజ సమయంలో 'ఓం నారాయణాయ విద్మహే, వసేద్వయ్ ధీమహి, తన్నో విష్ణు ప్రచోదయాత్' అనే మంత్రాన్ని నిరంతరం జపించండి. విష్ణువు యొక్క ఈ మంత్రం అన్ని కోరికలను తీరుస్తుందని నమ్ముతారు.
>> ఏకాదశి తిథి నాడు ధూప వేసి దీపం పెట్టి ఖచ్చితంగా విష్ణు సహస్రనామం చదవాలి. దీని తర్వాత వామనుని కథను చదవండి లేదా వినండి. ఇప్పుడు హారతి ఇచ్చి... దక్షిణ దానం చేయండి. మరుసటి రోజు శుభ సమయంలో ఈ ఉపవాసాన్ని విరమించండి.
>> ఈ రోజున రావి చెట్టును పూజించడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఈ చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దీంతో మీ ఇంట్లో దేనికీ లోటు ఉండదు. 

Also Read: Pitru Paksha 2022: పితృ పక్షం సమయంలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News