రెండు టెలికామ్ దిగ్గజాల మధ్య వైరం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే రిలయెన్స్ జియో యాజమాన్యం భారతీ ఎయిర్‌టెల్ కంపెనీపై టెలికమ్యూనికేషన్స్ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్ చేస్తున్న పనులు చట్టవ్యతిరేకంగా ఉన్నాయని... అందుకే ఆ కంపెనీపై తగు చర్యలు తీసుకొని భారీగా పెనాల్టీలు విధించాలని కోరింది.
ఎయిర్ టెల్ వాడే నెట్‌వర్క్ నోడ్స్ భారతదేశానికి వెలుపల ఉన్నాయని.. యాపిల్ వాచ్ సర్వీసులు అందివ్వడం కోసమే ఆ కంపెనీ ఈ మార్గాన్ని అనుసరిస్తోందని జియో తెలిపింది. ఈ విధంగా చేయడమంటే సెక్యూరిటీ నిబంధనల్లో తుంగలో తొక్కడమేనని జియో ఆరోపించింది. అయితే జియో చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఈ రెండు కంపెనీలు కూడా యాపిల్ వాచ్ 3 సిరీస్‌లను మే 11, 2018 తేది నుండీ అమ్ముతున్నాయి. అయితే ఎయిర్ టెల్ పద్ధతులు జాతీయ భద్రతకు భంగం కలిగించేవిధంగా ఉన్నాయని జియో ఫిర్యాదులో పేర్కొంది.
ఎయిర్‌టెల్ పై రిలయెన్స్ జియో ఫిర్యాదు