SS Rajamouli Speech At Brahmastra Press meet: బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్లాన్ చేసినా, అది కుదరకపోవడంతో సినిమా యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేశామని రెండు వారాల నుంచి టీం కష్టపడి సెట్స్ అన్ని ప్రిపేర్ చేశాయని, తారక్ కూడా అక్కడ సెట్స్ చూసి చాలా అద్భుతంగా కుదిరాయి జక్కన్న అన్నాడని చెప్పుకొచ్చారు.
ఐదు రోజులు ముందు కూడా సిటీ కమిషనర్ ఈ ఈవెంట్ చేసుకోవచ్చన్నారు, ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని వారు చెప్పినట్లే చేశామని అన్నారు. అయితే గణేష్ నిమజ్జనాలు ప్రారంభమైన నేపథ్యంలో వారికి పోలీసులను బందోబస్తుగా పంపాల్సి ఉంటుందని అందుకే ఇక్కడ పోలీసులు ఉండరు కాబట్టి అంత మంది జనంతో ఈవెంట్ నిర్వహించడం కష్టమని భావిస్తూ చివరి నిమిషంలో ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారని అన్నారు. వినాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కనికరించలేదని అనుకుంటున్నాను అని రాజమౌళి అన్నారు.
ఇక బ్రహ్మాస్త్రం సినిమా గురించి మాట్లాడుతూ రణబీర్ కపూర్ అగ్ని తన చేతితో విసిరే ఒక అద్భుతమైన శక్తి కలిగి ఉంటాడని ఇప్పటికే ఈ విషయాన్ని మనం ట్రైలర్ లో కూడా చూసామని అన్నారు. అయితే దాని లైవ్ లో చూపించడానికి మేము భారీగా ప్లాన్ చేసుకున్నాం అదంతా ఈవెంట్ మధ్యలో కూర్చుని చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదని అన్నారు. ఎన్టీఆర్ ను తొడగొట్టు చిన్న అని రణబీర్ కపూర్ అడిగితే అప్పుడు ఎన్టీఆర్ తొడగొట్టిన వెంటనే ఫైర్ జనరేట్ అయ్యేలా ప్లాన్ చేశాను కానీ అది ఏది ఇప్పుడు కుదరలేదని అదంతా సక్సెస్ మీట్ లో మాత్రం చేసి చూపిస్తామని అన్నారు. ఇక తనకు కరణ్ జోహార్ ఇద్దరికీ అసలు సంబంధం ఏమి ఉండదు, ఆయన చేసే సినిమాలు నేను చేసే సినిమాలు వేరువేరుగా ఉంటాయి అయితే సినిమాల మీద ఆయనకున్న ప్రేమను చూసి మాత్రం నేను ఆయనను ఇష్టపడతాను, ఆరాధిస్తానని చెప్పుకొచ్చారు.
ఐదేళ్ల క్రితం బ్రహ్మాస్త్రం అనే సినిమాను అయాన్ ముఖర్జీతో కలిసి చేస్తున్నామని కరణ్ జోహార్ చెప్పారని కథ వినమంటే ఆయన మీద ఉన్న గౌరవంతో వినడానికి అంగీకరించానని అన్నారు. చిన్ననాటి నుంచి వేదాలు పురాణాల మధ్య పెరిగిన మేము వెదురు కర్రలపై బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, విష్ణస్త్రం అంటూ రాసుకుని ఆడుకునే వాళ్ళమని మేమే కాదు చాలామంది అలాగే ఆడుకునే వాళ్ళని అన్నారు. సినిమా కదా విన్నాక చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయని అన్నారు. మరి రాజమౌళి సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. తెలుగులోనే కాదు దక్షిణాది భాషలో కూడా రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది వ్యాపార సంబంధం మాత్రమే అని చెప్పలేం ఎందుకంటే రాజమౌళి లాంటి దర్శకుడు సినిమాలో విషయం లేకపోతే అంతగా ప్రమోట్ చేయరు అని కొంతమంది భావిస్తున్నారు. చూడాలి మరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతోంది అనేది.
Also Read: Jr NTR at Brahmastram Press Meet: అందరికీ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. ప్రెజర్ లో ఉన్నామంటూ కామెంట్స్!
Also Read: Charmee Kaur on Karthikeya 2 Success: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి