మిషన్ 2020లో భాగంగా అంగారక గ్రహంపైకి త్వరలో ఓ హెలికాఫ్టర్‌ను పంపించనున్నట్లు నాసా తెలిపింది. రిమోట్ కంట్రోల్‌తో శూన్యంలో నడవగల చిన్న చాపర్‌ను పంపి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో గ్రహంపై హెలికాఫ్టర్ నడపడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని, రీచార్జ్ చేయగల సోలార్ బ్యాటరీల సాయంతో ఇది నడుస్తుందని చెప్పారు.
ఈ రిమోట్ కంట్రోల్ హెలికాఫ్టర్‌ను అంగారక వాతావరణంలో ప్రవేశపెట్టేవిధంగా రూపొందించినట్లు తెలిపారు. ట్విన్ కౌంటర్-రొటేటింగ్ బ్లేడ్లు కలిగిన ఈ చాపర్ నాలుగు పౌండ్ల బరువు (1.8 కిలోగ్రాములు) కలిగి ఉంటుందని నాసా పేర్కొంది.
#BREAKING @NASA news! Our next rover to Mars will carry the first helicopter ever to fly over the surface of another world. #Mars2020 #MarsCopter https://t.co/HyeuMu7Cqn pic.twitter.com/9LpFlFGfxK
— Jim Bridenstine (@JimBridenstine) May 11, 2018
హెలికాప్టర్లో లిథియం-అయాన్ బ్యాటరీలను ఛార్జ్ చేసేందుకు సోలార్ సెల్స్ ఉంటాయి. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలను (గడ్డకట్టే చలి) తట్టుకొనే విధంగా వేడిగా ఉంచడానికి హీటింగ్ మెకానిజంను అభివృద్ధి చేశారు. ఈ మార్స్ 2020 రోవర్ మిషన్‌ను జులై 2020లో ఫ్లోరిడాలోని కేప్ కానవాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి లాంఛనంగా ప్రారంభిస్తామని.. 2021 ఫిబ్రవరిలో మార్స్ చేరుకోనుందని చెప్పారు. భూగర్భ అధ్యయనాలు నిర్వహించడానికి, అంగారక గ్రహ పర్యావరణం, అక్కడ నివాసం ఉండటానికి గల అధ్యయనాలను నిర్ధారించే విధంగా ఈ రోవర్ రూపొందించబడిందని నాసా వెల్లడించింది.