Flipkart Realme Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 749కే రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌!

Flipkart Realme 9i 5G Offer. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌పై 15 శాతం ఆఫర్ ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 24, 2022, 07:01 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
  • రూ. 749కే రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌
  • సూపర్ కాయిన్స్ ఉపయోగించుకోవచ్చు
Flipkart Realme Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 749కే రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌!

Exchange Offer on realme 9i 5G in Flipkart: 'రియల్‌మీ' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో రియల్‌మీ బ్రాండ్‌కి మంచి పేరుంది. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇప్పటికే చాలా అద్భుతాలు సృష్టించింది. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్స్ అందిస్తూ.. స్మార్ట్‌ఫోన్‌రంగంలో దూసుకుపోతుంది. తాజాగా రియల్‌మీ.. Realme 9i 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సేల్ కూడా ఆరంభం అయింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌ (Metallica Gold, 128 GB, 6 GB RAM) అసలు ధర రూ. 19,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 15 శాతం ఆఫర్ ఉంది. దాంతో రూ. 3000 తగ్గింపుతో రియల్‌మీ 9i 5G రూ. 16,999లకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో రూ. 16,499 చెల్లించి.. 500 సూపర్ కాయిన్స్ ఉపయోగించుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ నాన్-EMI ద్వారా రూ. 1000 ఆఫర్ ఉంది. అలానే SBI క్రెడిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 16,250 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 19,999 రియల్‌మీ 9i 5G కేవలం రూ. 750కి సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుంటేనే రూ. 16,250 వస్తాయి. ఈ అవకాశం మళ్లీ రాదు కాబట్టి వెంటనే త్వరపడండి. 

రియల్‌మీ 9i 5G స్పెసిఫికేషన్లు:
# 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే
# మీడియాటెక్ డైమన్సిటీ 810 5G ప్రాసెసర్
# ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12
# 128 GB Rom, 6 GB RAM
# 50MP + 2MP + 2MP ప్రైమరీ కెమెరా
# 8MP ఫ్రంట్ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# మైక్రో USB పోర్ట్ 
# డ్యూయల్ సిమ్
# ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, ఫేస్ ఐడీ

Also Read: భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన అఫ్రిది!

Also Read: మూడుసార్లు కాటేసినా.. భారీ పామును పట్టుకున్నాడు! వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x