Asaduddin Owaisi: తెలంగాణ 8 ఏళ్లు ప్రశాంతంగా ఉందన్నారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దేశంలో ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందన్నారు. తెలంగాణలో శాంతి లేకుండా చేయాలని ఆ పార్టీ చూస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ ఆందోళనలు మిన్నంటాయి.
అప్రమత్తమైన పోలీసులు ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఆయనపై తెలంగాణవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈక్రమంలో హైదరాబాద్‌లో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళ్‌హాట్ పీఎస్‌లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్, బహదూర్‌పురా, డబీర్ పురా, బాలానగర్, పీఎస్‌ల్లో కేసులు నమోదు అయ్యాయి.
ఇటు సంగారెడ్డి, నిజామాబాద్‌లోనూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో బీజేపీ అధిష్టానం సిరీయస్ అయ్యింది. బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 2లోపు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు నాంపల్లి కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈక్రమంలో మరోమారు ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చివరకు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇటు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఐఎం కార్యకర్తలు , రాజాసింగ్ అనుచరులు భారీగా చేరుకున్నారు. రాజాసింగ్ మద్దతుగా నినాదాలు చేశారు. వీటికి వ్యతిరేకంగా ఎంఐఎం కార్యకర్తలు నినదించారు.
దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పాతబస్తీలో పోలీసులను భారీగా మోహరించారు.
Also read:Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా ప్రశంసలు..తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్ధలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి