BJP MP Parvesh Sahib Singh sensational comments on Telangana CM KCR Family over delhi liquor policy scam
బీజేపీ ఎంపీ పర్వేష్ సాహేబ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం ఫ్యామిలీ ఉందని కుండ బద్దలు కొట్టారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ రూమ్లో ఎక్సైజ్ పాలసీ రూపొందించారన్నారు. ఎక్సైజ్ కమీషనర్, ఢిల్లీ ఢిప్యూటీ సీఎం, లిక్కర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు సహా కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా హోటల్ రూమ్ డీల్లో ఉన్నారని పర్వేశ్ సింగ్ ఆరోపించారు. దాంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.