Sovereign Gold Bond Scheme: పెట్టుబడులు పెట్టేందుకు మరో అద్భుతమైన ప్రభుత్వ పధకమిది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడితే రిటర్న్ గ్యారంటీ ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
ఈ ఏడాది అంటే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండవ సిరీస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆగస్టు 26 వరకూ గడువుంది. బంగారానికున్న ఫిజికల్ డిమాండ్ తగ్గించేందుకు గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 నవంబర్ నెలలో ప్రారంభించింది. ఈ పధకంలో ప్రతి ఆరు నెలలకు వడ్డీ కచ్చితంగా లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి సావరీన్ గోల్డ్ పథకం కొనుగోలుకు అవకాశం లభిస్తోంది. 2022-23 లో బాండ్ రెండవ సిరీస్ ఆగస్టు 22 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకూ గడువుంది. గ్రాముకు 5,197 రూపాయలు చెల్లించి ఖరీదు చేయవచ్చు. ఒకవేళ బాండ్‌ను ఆన్లైన్ పొందాలంటే ప్రతి గ్రాముపై 50 రూపాయలు తగ్గుతుంది. అంటే గ్రాముకు కేవలం 5147 రూపాయలు చెల్లించి గోల్డ్ బాండ్ కొనుగోలు చేయవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం గోల్డ్ బాండ్ పధకం రెండవ సిరీస్‌లో గ్రాముకు 5197 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ క్లోజింగ్ ప్రైస్ ఆధారంగా నిర్ణయించారు. అంటే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 19 వరకూ ఉన్న బంగారం ధరపై యావరేజ్ తీసి నిర్ధారించారు. ఎందుకంటే ఆగస్టు 20, 21 తేదీల్లో మార్కెట్ ముూసి ఉంది. గతంలో అంటే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ మొదటి సిరీస్‌లో గ్రాముకు 5091 రూపాయలు చెల్లించారు. ఈసారి ధర కాస్త పెరిగింది. గతంతో పోలిస్తే 106 రూపాయలు పెరిగింది.
ఈ స్కీమ్‌లో గోల్డ్ బాండ్‌ను ఒకవేళ ఆన్లైన్ కొనుగోలు చేయాలనుకుంటే..ప్రతి గ్రాముకు 50 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది అంటే గ్రాముకు కేవలం 5147 రూపాయలు చెల్లిస్తే చాలు. ఈ బాండ్ కాల పరిమితి 8 ఏళ్లుగా ఉంటుంది. కావాలనుకుంటే 5 ఏళ్ల తరువాత ఎప్పుడైనా విత్‌డ్రా చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్‌పై 2.50 వార్షిక వడ్డీ ప్రతి 6 నెలలకోసారి లభిస్తుంది. ఈ వడ్డీపై ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
సావరీన్ గోల్డ్ బాండ్ కొనుగోలు వల్ల ఫిజికల్ గోల్డ్ కానందున దొంగతనం భయముండదు. అంతేకాకుండా ధరల పెరుగుదల వంటి కారణాల దృష్ట్యా బంగారంపై పెట్టుబడి మంచిదే. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో ఒక గ్రాము కొనుగోలుతో కూడా ప్రారంభించవచ్చు. ఒక ఆర్దిక సంవత్సరంలో 4 కిలోల వరకూ బంగారం కొనుగోలు చేయవచ్చు. హిందూ అవిభక్త కుటుంబాలైతే 20 కిలోల వరకూ తీసుకోవచ్చు. బ్యాంకు ద్వారా లేదా షేర్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also read: PK Kisan New Rule: పీఎం కిసాన్ యోజనలో కొత్త నిబంధన, డబ్బు వాపసు చేయకపోతే చర్యలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook