India set 290 Target to Zimbabwe in 3rd ODI: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు సత్తాచాటారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి రాహుల్ సేన 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో జింబాబ్వే ముందు 290 పరుగుల లక్ష్యం ఉంది. యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (130; 97 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో విఫలమవుతున్న ఇషాన్ కిషన్ (50; 61 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. శిఖర్ ధావన్ (40), కేఎల్ రాహుల్ (30) జట్టుకు ఆరంభం అందించారు. అయితే ఈ ఇద్దరు క్రీజులో కుదురుకోవానికి సమయం తీసుకున్నారు. తమకు దక్కిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చడంలో విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడాడు. ధాటిగా ఆడుతూ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గిల్ తోడుగా ఇషాన్ కిషన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
Innings Break!
A brilliant 130 from @ShubmanGill as #TeamIndia post a total of 289/8 on the board.
Scorecard - https://t.co/ZwXNOvRwhA #ZIMvIND pic.twitter.com/sKPx9NzWwi
— BCCI (@BCCI) August 22, 2022
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో భారీ భారీ స్కోర్ దిశగా వెళ్ళింది. కిషన్ పెవిలియన్ చేరిన అనంతరం దీపక్ హుడా (1) నిరాశ పరిచాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది మంచి ఊపుమీదున్న సంజూ శాంసన్ (15) త్వరగానే పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔట్ అయ్యారు. దీపక్ చహర్ (1), కుల్దీప్ యాదవ్ (2) నాటౌట్గా నిలిచారు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
Also Read: 25 ఏళ్ల కింగ్ కోబ్రా.. ఎన్ని గుడ్లు పెట్టిందో తెలుసా? బుసలు కొడుతున్నా ఎగ్స్ బయటికి తీసుకొచ్చాడు
Also Read: Jr Ntr: లీడర్లు సైలెంట్.. కేడర్ ఫైర్! టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook