Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. అన్ని నియోజకవర్గాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతం, టికెట్ల కేటాయింపుపై మంతనాలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఉంటాయని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఈక్రమంలోనే పార్వతీపురం, రంపచోడవరం, మాడగుల నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలతో మంతనాలు జరిపారు. పార్టీ బలోపేతానికి నేతలంతా కృషి చేయాలని ఆదేశించారు. విభేదాలను పక్కకు పెట్టి పార్టీ కోసం పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికలో ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుందన్న దానిపై చర్చించారు.
ఈసందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రాష్ట్రానికి పట్టిన వైరస్ అని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలని ఆదేశించారు చంద్రబాబు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. నిత్యం అప్పులు చేస్తూ అభివృద్ధిగా చెబుతున్నారని విమర్శించారు.
ఏపీలో వేధింపులు, కబ్జాలు, కేసులు, ఆత్మహత్యలు, కూల్చివేతలు సర్వ సాధారణమయ్యాయని మండిపడ్డారు. వైసీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాల కారణంగా ఎంతో మంది బాధితులుగా మారారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇవే తమ పార్టీకి అస్త్రాలు మారుతాయన్నారు చంద్రబాబు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ప్రజా పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతల దందాలను వెలికి తీయాలని..బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రతరమయ్యింది. వైసీపీ నేతల భూదందాలు, దౌర్జన్యాలు, అక్రమాలను టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమదే అధికారమని..ఇందులో ఎలాంటి సందేశం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతల తీరే తమకు ఆయుధంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
Also read:CM Kcr: ఈడీకి దొంగలు భయపడతారు..నేను ఎందుకు భయపడతా..సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్..!
Also read:Pawan Kalyan: పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది..వైసీపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu: ఏపీకి పట్టిన వైరస్ వైసీపీ..జగన్ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపాటు..!
ఏపీలో హాట్ హాట్‌గా పాలిటిక్స్
వైసీపీ వర్సెస్ టీడీపీ
చంద్రబాబు హాట్ కామెంట్స్