Eesha Rebba Pics: కిరాక్ అందాలతో కవ్విస్తోన్న ఈషా రెబ్బా.. కుర్రాళ్ల హృదయాలకు చిల్లులే!

Eesha Rebba Latest hot Images goes viral. మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. లాంగ్ డ్రెస్సులో అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 17, 2022, 07:55 PM IST
  • కిరాక్ అందాలతో కవ్విస్తోన్న ఈషా రెబ్బా
  • కుర్రాళ్ల హృదయాలకు చిల్లులే
  • వావ్ అనిపిస్తున్న తెలుగు అమ్మాయి
Eesha Rebba Pics: కిరాక్ అందాలతో కవ్విస్తోన్న ఈషా రెబ్బా.. కుర్రాళ్ల హృదయాలకు చిల్లులే!

Eesha Rebba raises the temperature in long dress: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు. 

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు', 'త్రీ రోజెస్'తో ఆకట్టుకున్నారు. 

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు కావడం గమనార్హం. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం ఈషా ఎదురు చూస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు నెట్టింట లైకుల వర్షం కురుస్తుంటుంది.

మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. లాంగ్ డ్రెస్సులో అందాలను ప్రదర్శిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. తాజా ఫోటోలలో ఆమె వావ్ అనిపిస్తున్నారు. 

Also Read: అనన్య పాండేతో విజయ్ దేవరకొండ డేటింగ్.. ఆశీర్వదించిన 'రౌడీ హీరో' తల్లి!

Also Read: ఈడు మగాడ్రా బుజ్జి.. 12 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి! గూస్ బంప్స్ ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News