Ola S1 Electric Scooter: ఓలా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం!

Ola Electric launches Ola S1 Electric Scooter.  ఓలా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 16, 2022, 04:53 PM IST
  • ఓలా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌
  • సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం
  • కొనుగోలు సెప్టెంబర్ 1 నుంచి ఆరంభం
Ola S1 Electric Scooter: ఓలా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం!

Ola Electric launches Ola S1 Electric Scooter in India: ప్రముఖ వాహన సంస్థ 'ఓలా'.. క్యాబ్ సర్వీస్ నుంచి ఆటో రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓలా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్. S1 ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో మాదిరిగానే ఉంది. ఓలా S1 కొనుగోలు సెప్టెంబర్ 1 నుంచి ఆరంభం అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు మాత్రం సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతాయి. ఎక్స్ షోరూంలో ఈ విద్యుత్ స్కూటర్ ప్రారంభ ధర రూ.99,999లుగా ఉంది. 

ప్రీ-రిజర్వ్:
ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450X, Simple One, TVS iQube మరియు Okinawa Okhi 90 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా వచ్చింది. ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు రూ.499 చెల్లించి ఓలా S1ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-రిజర్వ్ చేసిన వారికి సెప్టెంబర్ 1న పర్చేసింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఇతర కస్టమర్లు మాత్రం సెప్టెంబర్ 2 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక రూ.2,999 ఈఎంఐతో ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. దీనికి లోన్ ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంది. 

సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం:
ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 2.98kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్ మరియు రివర్స్ మోడ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Pro లాగా కనిపిస్తుంది. డిజైన్ అంశాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, పింగాణీ వైట్ మరియు నియో మింట్ రంగులలో ఓలా ఎస్1 అందుబాటులో ఉంటుంది.

ప్రోలో ఖాకీ కలర్‌:
Ola S1 లాంచ్‌తో పాటు Ola S1 Proలో కొత్త కలర్‌ను ఓలా రిలీజ్ చేయనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఓలా ఎస్1 ప్రోలో ఖాకీ కలర్‌ను తీసుకొస్తోంది. ఖాకీ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.49 లక్షలు. ఇప్పటికే మార్ష్‌మెల్లో, నియో మింట్, పోర్సిలైన్ వైట్, జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మ్యాట్ బ్లాక్, అంత్రసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్, గెరువా కలర్ ఆప్షన్స్‌లో ఓలా ఎస్1 ప్రో అందుబాటులో ఉంది. 

ఎలక్ట్రిక్ కారు:
ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఓలా మొదటి ఎలక్ట్రిక్ కారును కూడా పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ కారు 2024లో విడుదల కానుంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారత్‌లో తయారైన అత్యంత స్పోర్టీగా కనిపించే కారు ఇదే అని అన్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారు 4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని, 500 km కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని అగర్వాల్ పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారులో అసిస్టెడ్ డ్రైవ్ టెక్నాలజీ, కీలెస్ ఆపరేషన్ మరియు ఓలా మూవ్ ఓఎస్ వంటి ఫీచర్లు ఉంటాయని చెప్పారు.

Also Read: క్లిక్స్ కోసం నన్ను బద్నామ్ చేయొద్దు.. కామన్ సెన్స్ ఉండాలంటూ దిల్ రాజు ఫైర్

Also Read: Munugode: బ్రేకింగ్.. మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎంపీపీ సహా కీలక నేతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News