Bahubali Reception:100 ఎకరాలు.. 250 కోట్లు.. 3 లక్షల మంది అతిధులు! గాలిని తలదన్నేలా పొంగులేటి వేడుక..

Ponguleti Srinivas Reddy:  2016 నవంబర్ లో జరిగిన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహం దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.గాలి స్టైల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మరో బహుబలి ఈవెంట్  జరగబోతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కూతురు మ్యారేజ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 03:13 PM IST
  • ఖమ్మంలో పొంగులేటి కూతురు వివాహ రిసెప్షన్
  • వంద ఎకరాల్లో బాహుహలి సెట్టింగ్
  • రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్న పొంగులేటి
Bahubali Reception:100 ఎకరాలు.. 250 కోట్లు.. 3 లక్షల మంది అతిధులు! గాలిని తలదన్నేలా పొంగులేటి వేడుక..

Ponguleti Srinivas Reddy:  2016 నవంబర్ లో జరిగిన బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కూతురు వివాహం దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. బెంగళూరు విజయనగర ఎంపైర్ ప్యాలెస్ లో అత్యంత వైభంగా నిర్వహించిన వివాహ వేడుకకు గాలి జనార్ధన్ రెడ్జి సుమారు 550 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి స్టైల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మరో బహుబలి ఈవెంట్  జరగబోతోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కూతురు మ్యారేజ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బుధవారం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో జరగనున్న ఈ బాహుబలి వేడుకకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  ఇందుకోసం సుమారు 250 కోట్ల రూపాయలు పొంగులేటి ఖర్చు చేశారని తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి  కూతురు స్వప్ని రెడ్డి పెళ్లి ఈనెల 12న రాత్రి ఇండోనేషియాలోని బాలి జరిగింది.  పొంగులేటి, రామసహాయం సురేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు, పలువురు ఇతర ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. బాలిలో జరిగిన పెళ్లి వేడుకకు తనకు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు.. దాదాపు 5 వందల మందిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు పొంగులేటి.

ఈనెల 17న ఖమ్మంలో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఏర్పాటు చేశారు.  ఇందుకోసం వంద ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు. .బాహుబలి రేంజ్‌లోసెట్టింగ్‌లు వేశారు. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదిక నిర్మించారు. దాదాపు 10 లక్షల మంది పొంగులేటి ఆహ్వానం వెళ్లిదంటున్నారు. మూడు లక్షల మంది అతిధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేశారు. వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మించారు. దాదాపు 60 వేల కార్లు వస్తాయని భావిస్తూ.. ఇందుకోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

పొంగులేటి కూతూరు రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా హజరుకానున్నారు. వీఐపీల కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.వంద ఎకరాల్లో రిసెప్షన్ సెట్టింగ్ లు ఒక రేంజ్ అయితే.. గార్డెన్ కు వచ్చేందుకు దారి కోసం ఏకంగా కొత్త బ్రిడ్జీనే నిర్మించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిసెప్షన్‌ వేడుక జరిగే ఎస్‌ఆర్‌ గార్డెన్‌కు వెళ్లే మార్గంలో డీప్‌ కట్‌ ఉంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో కాలువపై కోటి రూపాయల వ్యయంతో కొత్త వంతెన  నిర్మించారు. ఐరన్‌తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిని కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశారు. పెళ్లి పత్రిలకతో పాటు ప్రతి ఒక్కరికి గోడ గడియారాలు బహుకరించారు ఎంపీ పొంగులేటి. మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన వేడుక ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెన్సేసన్ క్రియేట్ చేస్తోంది.

Read Also: Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్‌ వాంగ్.. మనకు గండమేనా?  

Read Also: ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్‌లో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు! హృదయాలను పిండేసే దృశ్యం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News