Ola Electric Car Range: ఓలా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కృతమైంది. సింగిల్ రీఛార్జ్‌లో ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2024 నాటికి మార్కెట్లో రానున్న ఓలా ఎలక్ట్రిక్ కారుపై భారీ అంచనాలే ఉన్నాయి..
ఓలా ఎలక్ట్రిక్ కారు త్వరలో రానుంది. ఓలా ఎలక్ట్రిక్ కారు వివరాలను ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ అన్వీల్ చేశారు. 2024 నాటికి మార్కెట్లో ప్రవేశించనున్న ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతల్ని ఆయన వివరించారు. దేశంలో ఇప్పటివరకూ ఏ కంపెనీ నిర్మించని విధంగా స్పోర్ట్స్ మోడల్లో మొత్తం గ్లాస్‌రూఫ్‌తో వస్తోందని ఓలా సంస్థ వెల్లడించింది. మోస్ట్ అడ్వాన్స్ కంప్యూటర్ వెర్షన్ 4డబ్ల్యుతో అనుసంధానమై ఉంటుంది ఈ కారు. కీ, హ్యాండిల్ లేకుండా వస్తున్న అధునాతనమైన కారు ఇది.
ఓలా ప్రత్యేకమైన MoveOS సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది. ఫలితంగా కారు ఓనర్లు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లు అందుకుంటారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇండియా కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని..ప్రపంచ ఆటోమేటివ్ మార్కెట్లో 25 శాతం వాటా కలిగి ఉండాలని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే మనం సోలార్, ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ల ఉత్పత్తిని మిస్సయ్యామని..ఇప్పుడు పెట్టుబడి పెడితే..ఎలక్ట్రిక్ సెల్స్, బ్యాటరీస్ మార్కెట్‌ను లీడ్ చేయవచ్చని చెప్పారు.
కంపెనీ త్వరలో దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 100కు పైగా హైపర్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రిక్ రంగంలో ఓలా తొలిసారిగా ఓలా ఎస్1 స్కూటర్‌ను 99 వేల 999 రూపాయలకు లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మొత్తం ఫోకస్ ఓలా ఎలక్ట్రిక్ కారుపై ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే ..ఓలా ఎలక్ట్రిక్ కారు ఏకంగా 5 వందల కిలోమీటర్లు ఏకధాటిగా ప్రయాణించగలదని..జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకోగలదని ఓలా తెలిపింది.
Also read: Oppo A57 Launch: ఒప్పో నుంచి త్వరలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook