Rakesh Jhunjhunwala: దేశంలో స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిజినెస్ టైకూన్ గా చెప్పుకునే రాకేశ్ ఝుంఝన్‌వాలా హఠాన్మరణం చెందారు. ఆయనకు ఇప్పుడు 62 సంవత్సరాలు. గుండెపోటుతో తన నివాసంలోనే రాకేశ్ ఝుంఝన్‌వాలా చనిపోయారు. కొంత కాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధ పడుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రాకేశ్ ఝుంఝన్‌వాలా ఆదివారం ఉదయం హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయారని నిర్ధారించారు.
చార్టర్డ్ అకౌంటెన్సీని పూర్తి చేయగానే స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు రాకేశ్ ఝుంఝన్‌వాలా. కొంత కాలానికే ఆరితేరిపోయాడు. 5 వేల పెట్టుబడితో 11 వేల కోట్ల రూపాయలు సంపాందించారు. భారత్ లో షేర్ మార్కెట్ లో అతను. 'ఇండియాస్ వారెన్ బఫెట్', 'బిగ్ బుల్' గా రాకేశ్ ఝుంఝన్‌వాలా ప్రసిద్ధి చెందారు. ఆగస్టు 7న ఎయిర్‌లైన్ కో అయిన అకాశ ఎయిర్ లైన్స్ ను కొనుగోలు చేశారు. ఆగష్టు 7న అకాస తన వాణిజ్యపరమైన ఆప్‌లను ప్రారంభించింది, దేశంలోని ఎక్కువ మంది ప్రజలు మళ్లీ విమానంలో ప్రయాణించడం ప్రారంభిస్తారనే ఆశావాద అంచనాతో తాను ఈ ప్రయత్నాన్ని చేపడుతున్నట్లు జున్‌జున్‌వాలా ప్రకటించారు. డిమాండ్ పరంగా భారతదేశ విమానయాన రంగంపై తాను చాలా చాలా బుల్లిష్‌గా ఉన్నానని చెప్పారు రాకేశ్ ఝుంఝన్‌వాలా.