Dalit Boy Beaten By Teacher after Touching Drinking Water Pot: రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో మంచినీళ్ల కుండను తాకాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితురాలిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్తాన్‌లో సంచలనంగా మారింది.
రాజస్తాన్‌లోని జలోర్ జిల్లా సురానా గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్ అనే ప్రైవేట్ స్కూల్లో ఇందర్ మేఘవాల్ (9) అనే దళిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 20న స్కూల్‌కు వెళ్లాడు. స్కూల్లో బాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగేందుకని కుండ వద్దకు వెళ్లాడు. అంతే.. ఆ స్కూల్ టీచర్ చైల్ సింగ్ (40) ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టాడు.
కళ్లు, ముఖ భాగంలో తీవ్ర గాయాలవడంతో మేఘవాల్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉదయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారం పాటు చికిత్స పొందిన బాలుడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ బాలుడు కోలుకోలేకపోయాడు. శనివారం ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇది చాలా విషాదకరమైన ఘటన అని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. బాలుడి మృతికి కారణమైన టీచర్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందన్నారు. పోలీసులు ఆ టీచర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సత్వర విచారణ జరిపి నివేదిక అందజేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ అధికారులను ఆదేశించింది.
Also Read: Water Supply Shutdown: జంటనగరాల్లో 36 గంటల పాటు నీళ్లు బంద్, నీటి సరఫరా ఆగే ప్రాంతాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook