Rakshabandhan 2022: రక్షాబంధన్ అనేది సోదర సోదరీమణుల అనురాగం, ప్రేమకు చిహ్నం. సోదరుడి దీర్ఘాయుష్షు కోరుతూ సోదరి రాఖీ కట్టే వేడుక. అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. రాఖీ ఎంపిక జాగ్రత్తగా లేకపోతే మూల్లం చెల్లించుకోవల్సి వస్తుందట..
ఇవాళ ఆగస్టు 11. 2022 గురువారం దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. కొంతమంది ఆగస్టు 12న కూడా రాఖీ పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి రక్షాబంధన్ సమయం రేపు ఉదయం వరకూ ఉంది. మరోవైపు ఇవాళంతా రక్షాబంధన్ భద్ర ముహూర్తంలో ఉండటం వల్ల చాలామంది ఈ ముహూర్తంలో రాఖీ కట్టరు.
రక్షాబంధన్ నాడు సోదరుడి దీర్ఘాయుష్షు, సుఖ సంతోషాల కోసం ప్రార్ధిస్తూ సోదరుడి చేతికి సోదరి రాఖీ కడుతుంది. అందుకు ప్రతిగా ఆ సోదరికి..సోదరుడు బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. జీవితాంతం ఆమెను సంరక్షిస్తానని మాటిస్తాడు. అందుకే రాఖీని రక్షాసూత్రం అని కూడా పిలుస్తారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు..మార్కెట్లో లభించే అందమైన రాఖీల కోసం వెతుకుతుంటారు. అయితే ఏమరపాటు లేదా తొందరలో ఒక్కోసారి రాఖీల ఎంపిక సరిగ్గా ఉండదు. ఇది సోదరుని జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే రాఖీ ఎంపిక కూడా సరిగ్గా ఉండాలంటారు.
అందం, ఫ్యాన్సీ డిజైన్ బాగుందనే ఉద్దేశ్యంతో..అశుభ చిహ్నాల రాఖీలు కొనుగోలు చేయకూడదు. రక్షాబంధన్ పవిత్రమైన పండుగైనందున..అశుభ చిహ్నాలతో ఉండే రాఖీ కడితే..ఆ సోదరుడి జీవితంలో నెగెటివిటీ వ్యాపిస్తుంది. ఇక చాలా సందర్భాల్లో తొందరలో విరిగిన లేదా చిరిగిన రాఖీల్ని కడుతుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. రాఖీ కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. లేకపోతే మీ సోదరుడికి ఇబ్బందులు ఎదురౌతాయి. ఇంకొన్ని సందర్భాల్లో దేవీ దేవతల చిహ్నాలుండే రాఖీలు కడుతుంటారు. ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు జ్యోతిష్య పండితులు. దేవీదేవతల రాఖీ చేతికి రాఖీలా కట్టడమంటే అవమానించడమేనని అర్ధం. ఎందుకంటే రాఖీ అనేది చాలా రోజులుంటుంది. అపవిత్రమౌతుంది.
రక్షాబంధన్ రోజు నల్ల వస్త్రాలు ధరించకూడదు. నల్ల రంగు రాఖీ కూడా కట్టకూడదు. ఇది నెగెటివిటీకి చిహ్నం. ఫలితం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఇక ప్లాస్టిక్ రాఖీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ సంబంధం నేరుగా పాపాల గ్రహం కేతువుతో ఉంటుంది. ఇలాంటి రాఖీ కట్టడం వల్ల సోదరుడికి అగౌరవం ఎదుర్కోవల్సి వస్తుంది. ఎప్పుడూ రేష్మీ దారంతో చేసిన రాఖీ లేదా చేతితో చేసిన రాఖీనే కట్టాలి. ఇటువంటి రాఖీ శుభం కల్గిస్తుంది.
Also read: Narali Purnima 2022: నరాలి పూర్ణిమ అంటే ఏంటి? ఈ పండుగను ఎవరు జరుపుకుంటారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook