Venus Transit 2022: కర్కాటకంలో సూర్య శుక్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి ధనలాభం!

Venus Transit 2022: కర్కాటక రాశిలో సూర్య శుక్రుల సంయోగం మూడు రాశులవారికి భారీగా లాభాలను తెస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 10:55 AM IST
  • కర్కాటకంలో శుక్ర సంచారం
  • ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్
Venus Transit 2022: కర్కాటకంలో సూర్య శుక్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి ధనలాభం!

Sun and venus Conjunction in Cancer 2022: గ్రహాల మార్పు ప్రతి రాశి చక్రంపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమ, శృంగారం, లగ్జరీ మెుదలైనవాటికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం ఈనెల 07 ఆగస్టు 2022న తన రాశిని మార్చి... కర్కాటక రాశిలోకి (Venus Transit in Cancer 2022) ప్రవేశించాడు. అక్కడే శుక్రుడు ఆగస్టు 31 వరకు ఉంటాడు. కర్కాటకంలో సూర్యుడు ఇప్పటికే ఉన్నాడు. సూర్యుడు, శుక్రుడు కలయిక (Sun and venus Conjunction 2022) వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందునున్నారు.  ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం (Gemini): సూర్య, శుక్రుల కలయిక మిథునరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఊహించని ధనలాభం ఉంటుంది.  వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు.  కెరీర్ లో పురోగతి ఉంటుంది. లవ్ లైఫ్ అద్భుతంగా ఉండనుంది. 

కన్య (Virgo): కర్కాటక రాశిలో శుక్రుడు మరియు సూర్యుని కలయిక వల్ల కన్యా రాశి వారికి అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఈ రాశి వారికి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ధన లాభం ఉంటుంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.

తుల (Libra): తుల రాశికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ రాశివారు లాభపడనున్నారు. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.  
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారానికి జీ మీడియా బాధ్యత వహించదు)

Also Read: Mangala Gauri Vrat 2022: ఈ రోజు శివపార్వతులను పూజిస్తే... అంతులేని సంపద మీ సొంతం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News