'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్' పథకం ద్వారా ప్రతీ నెలా రూ.3 వేలు.. ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి

Pradhan Mantri Shram Yogi Maandhan Yojana : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ పథకానికి అర్హులు.దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 8, 2022, 04:58 PM IST
  • ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పథకం
  • ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండినవారికి ప్రతీ నెలా రూ.3 వేలు ఫించన్
  • ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి
'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్' పథకం ద్వారా ప్రతీ నెలా రూ.3 వేలు.. ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి

Pradhan Mantri Shram Yogi Maandhan Yojana: దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన' పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన కార్మికులకు ప్రతీ నెలా రూ.3 వేలు ఫించన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో వారి అవసరాలు తీర్చుకునేందుకు ఈ ఫించన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు.. పథకం నిబంధనలేంటి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరు అర్హులు :

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఈ పథకానికి అర్హులు. అసంఘటిత రంగమంటే.. భవన నిర్మాణ కూలీలు, హమాలీలు, వీధి వ్యాపారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు, చెత్త ఏరుకునేవారు, ఇళ్లల్లో పనిచేసేవారు, బట్టలు ఉతికేవారు, రిక్షా తొక్కేవారు, భూమి లేని నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, లెదర్ వర్కర్స్, తదితరులు అసంఘటిత రంగంలోకి వస్తారు. దేశంలో దాదాపు 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. దేశ జీడీపీకి ఈ అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు 50 శాతం వాటా అందిస్తున్నారు. 18-40 ఏళ్ల వయసు కలిగి, నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉన్న అసంఘటిత కార్మికులు 'ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్' పథకానికి అర్హులు. 

ఎవరు అనర్హులు :

  • ఈపీఎఫ్‌వో,ఎన్‌పీఎస్,ఈఎస్ఐసీ లబ్దిదారులు ఇందుకు అనర్హులు
  • ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా ఈ పథకానికి అనర్హులు 

ఈ పథకం కోసం ఎంత చెల్లించాలి :

  • 18-40 ఏళ్ల కార్మికులు ప్రతీ నెలా రూ.55-రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
  • 60 ఏళ్లు నిండిన తర్వాత వారికి ప్రతీ నెలా రూ.3 వేలు ఫించన్ రూపంలో అందుతుంది.

అవసరమైన డాక్యుమెంట్స్ :

  • ఆధార్ కార్డు
  • సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్/జన్ ధన్ అకౌంట్

ఎలా అప్లై చేసుకోవాలి :

  1. మొదట https://maandhan.in/shramyogi ఓపెన్ చేయాలి.
  2. అందులో ఎన్‌రోల్‌మెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
  3. స్క్రీన్‌పై సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. 
  4. మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
  5. ప్రక్రియ పూర్తయ్యాక మీ సెల్‌ఫోన్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News