Monkeypox Vaccine: దేశంలో మంకీపాక్స్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మంకీపాక్స్ కలవరం కల్గిస్తోంది. అదే సమయంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలక ప్రకటన చేసింది.
ఇండియాలో మంకీపాక్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో 8 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఢిల్లీలో 2, కేరళలో 4 కేసులున్నాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న క్రమంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా..మంకీపాక్స్ వ్యాక్సిన్ విషయంలో కీలకమైన ప్రకటన చేశారు.
మంగళవారం జరిగిన ఒక భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవియా ఈ విషయాన్ని వెల్లడించారు. మంకీపాక్స్ వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అటు సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకూ వెలుగుచూసిన 8 కేసుల్లో ఐదు కేసులకు విదేశీ యాత్ర నేపధ్యముందన్నారు.
మరోవైపు పెరుగుతున్న మంకీపాక్స్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..విమనాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్, కేరళ సరిహద్దు జిల్లాల్లో కట్టుదిట్టమైన నిఘా పెడుతున్నామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. కర్ణాటకలో ఇప్పటివరకూ మంకీపాక్స్ కేసులు లేవు. 3 అనుమానాస్పద కేసుల్లో రెండు నెగెటివ్ అని తేలాయి. మరొకటి ఉత్తర కన్నడ జిల్లాలోని బెల్జియం వాసిది. ఆ రిపోర్ట్ ఇంకా రావల్సి ఉంది.
Also read: Diabetes Control Tips: మధుమేహంతో బాధపడే వారు ఈ నియమాలు పాటిస్తే.. 10 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook