Turmeric Milk Side Effects: కరోనా సమయంలో చాలా మంది పాలు, పనుపుని కలుపుకుని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాలలో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల వాటిని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరరంపై ప్రభావవం పడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని మిక్స్ చేసి తాగడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయో తెలుసుకుందాం..
పసుపు, పాలు కలిపి తాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలు:
గర్భధారణ సమస్యలు:
పసుపులో శరీరానికి వేడిని కలిగించే ప్రభావం ఉంటుంది. కావున గర్భిణీ స్త్రీలు పాలు, పసుపు మిక్స్ చేసి తాగడం వల్ల గర్భధారణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
కాలేయ సమస్యలు:
క్రమం తప్పకుండా పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కాలేయం చెడిపోయే అవకశాలు కూడా అధికమని నిపుణులు చెబుతున్నారు.
పొట్ట సమస్యలు:
పాలు, పసుపు కలుపుకుని రోజూ ఉదయం తాగడం వల్ల రాళ్ల సమస్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కావున ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇలా తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం సమస్య:
మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలు, పసుపు కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా మిక్స్ చేసిన పాలను యాబెటిక్ రోగులకు తాగడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం మరింత పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook