Weight Loss Food: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఊబకాయంతో పోరాడుతూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి కీటోజెనిక్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? మనం రోజూ తీసుకునే ఆహారాల్లో కార్బొహైడ్రేట్ల వల్ల మనకి గ్లూకోజ్ లభిస్తుంది. అయితే శరీర శ్రమ కోసం బాడీ గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును మూల పదార్థంగా వినియోగించడాన్ని కీటోజెనిక్ డైట్ అని అంటారు. ప్రస్తుతం చాలా మంది ఈ డైట్‌ను ఫాలో అవడ్డం విశేషం.. అయితే క్రమం తప్పకుండా వర్కౌట్, కీటో ఫుడ్స్ తీసుకోవడం త్వరలోనే ఫలితాన్ని పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. కీటో డైట్‌లో తక్కువ కార్బోహైడ్రేట్‌లను ఉపయోగించడం వల్ల శరీరాన్ని బలంగా చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అయితే చాలా మంది ఈ డైట్‌ను అనుసరించిన తర్వాత బరువు తగ్గి.. మధుమేహం కూడా నియంత్రణలో ఉందని నివేదికలు తెలిపాయి.
కీటోజెనిక్ ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంది పిల్లల్లో మూర్ఛ వంటి సమస్యలు కూడా దూరమయ్యాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ డైట్ ఫుడ్‌లో గుండె జబ్బులను, కాన్సర్‌ను నియంత్రించే మూలకాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. . కీటో ఫుడ్స్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ స్థూలకాయాన్ని నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
కీటోజెనిక్ డైట్‌లో ఎలాంటి ఆహారపదార్థాలుంటాయి:
ఇందులో శరీరానికి మేలు చేసే అధిక పోషకాలున్న ఆహారాలుంటాయి. కావున శరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి:
>> జున్ను
>> అవోకాడో ఆయిల్
>> డార్క్ చాక్లెట్
>> కోకో పౌడర్
>> పెరుగు, చీజ్
>> గుడ్లు
>> కొబ్బరి నూనె
>> గింజలు
>> విత్తనాలు
>> జామున్
>> చేపలు
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook