Monkeypox Case In India: Second monkeypox virus case confirmed in Kerala. కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. కన్నూరుకు చెందిన ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. కన్నూరుకు చెందిన ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న భారత దేశంలో తొలి మంకీపాక్స్ కేరళలోనే నమోదైన విషయం తెలిసిందే. కొల్లాంకు చెందిన వ్యక్తి ఇటీవల షార్జా నుంచి రాగా.. అతడికి పాజిటివ్‌గా తేలింది.