England vs India 2nd ODI : ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా ఇంగ్లాండ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. కానీ ఆ తర్వాత లక్ష్య చేధనలో పూర్తిగా చేతులెత్తేసింది. ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 30 పరుగులు చేయలేకపోయారంటే టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా టీమిండియాపై ఇంగ్లాండ్ ఏకంగా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లలో 246 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మొయిన్ అలీ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విల్లే (41), బెయిర్‌స్టో (38), లివింగ్‌స్టోన్ (33) పరుగులతో రాణించారు. 102 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును మొయిన్ అలీ-విల్లే 62 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం వల్లే ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. టీమిండియా బౌలర్లలో చహల్ 4 వికెట్లు తీయడం విశేషం. బుమ్రా, పాండ్యా చెరో రెండు వికెట్లు తీయగా,షమీ, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.
247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2వ ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేవలం 6 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (29), హార్ధిక్ పాండ్యా (29) చేసిన స్కోర్లే జట్టులో టాప్ స్కోర్ కావడం గమనార్హం. రోహిత్ సహా రిషబ్ పంత్,ప్రసిద్ధ్ డకౌట్‌గా నిలిచారు. మొత్తంగా బ్యాటింగ్ పరంగా ఘోరంగా విఫలమైన టీమిండియా 38.5 ఓవర్లలో కేవలం 146 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లే 6 వికెట్లతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. విల్లే, కార్సే, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. ఈ వన్డేలో ఇంగ్లాండ్ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.
Also Read: Horoscope Today July 15th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook