Curd Benefits: పెరుగు రోజూ తింటే..అన్ని సమస్యలు దూరం, బరువు తగ్గడంలో కీలకపాత్ర

Curd Benefits: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎముకలకు బలాన్నిస్తుంది. పెరుగులో పుష్కలంగా లభించే పోషక పదార్ధాల కారణంగా పలు రోగాలు దూరమౌతాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2022, 08:38 PM IST
Curd Benefits: పెరుగు రోజూ తింటే..అన్ని సమస్యలు దూరం, బరువు తగ్గడంలో కీలకపాత్ర

Curd Benefits: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎముకలకు బలాన్నిస్తుంది. పెరుగులో పుష్కలంగా లభించే పోషక పదార్ధాల కారణంగా పలు రోగాలు దూరమౌతాయి.

పాల ఉత్పత్తులు చాలావరకూ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చేవే. ఇందులో పెరుగు చాలా కీలకమైంది. క్రమం తప్పకుండా మీ డైట్‌లో పెరుగు చేర్చుకుని తినడం వల్ల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రకాల సమస్యలు దూరమౌతాయంటున్నారు వైద్య నిపుణులు. పెరుగు రోజూ తీసుకుంటే..శరీరానికి కావల్సిన పోషక గుణాలు పుష్కలంగా అందుతాయి. ఫలితంగా ఎముకలు పటిష్టమౌతాయి. కడుపుకు చలవ చేస్తుంది కూడా. పెరుగులో కార్బోహైడ్రేట్లు, షుగర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, సల్ఫర్, సెలేనియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషక పదార్ధాలన్నీ పెరుగులో పుష్కలంగా లభిస్తాయి. 

పెరుగుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల మీ ఇమ్యూనిటీ బలోపేతమవుతుంది. వేసవిలో క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల శరీరం వేడి చేయకుండా ఉంటుంది. పెరుగుతో ఎముకలు పటిష్టమౌతాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ మెండుగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. 

ఇక మరో ఉపయోగం బరువు తగ్గుతుంది. పెరుగును క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గుతారు. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. హెల్తీ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడంలో దోహదపడుతుంది. అంతేకాదు..కొలెస్ట్రాల్ సమస్య దూరమౌతుంది. మరో ముఖ్యమైన లాభం..జీర్ణక్రియ సులభం కావడం. పెరుగు రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి..ఆరోగ్యవంతంగా ఉంటారు. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఇందుకు దోహదపడుతుంది. 

Also read: Monsoon Diseases: వర్షాకాలంలో ఎదురయ్యే సీజనల్, ప్రాణాంతక వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవాలి

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News