ETELA RAJENDER: కేసీఆర్ కు రాజపక్స గతే... గజ్వేల్ లో బొంద పెడత! ముందస్తుకు సిద్ధమన్న ఈటల రాజేందర్

ETELA RAJENDER: ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలపై ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలనాధులు

Written by - Srisailam | Last Updated : Jul 11, 2022, 02:32 PM IST
  • సీఎం కేసీఆర్ కు ఈటల కౌంటర్
  • గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడిస్తా- ఈటల
  • ముందస్తుకు సిద్ధమన్న ఈటల రాజేందర్
ETELA RAJENDER: కేసీఆర్ కు రాజపక్స గతే... గజ్వేల్ లో బొంద పెడత! ముందస్తుకు సిద్ధమన్న ఈటల రాజేందర్

ETELA RAJENDER: ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నేతలపై ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు కమలనాధులు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ గులాబీ బాస్ కు కౌంటరిస్తున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక రాజేస్తున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ రెండు రోజుల క్రితం చిట్ చాట్ లో మాట్లాడిన ఈటల రాజేందర్.. ఈసారి నేరుగానే ప్రకటన చేశారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నానన్నారు. గజ్వేల్ లో పోటీ చేసి తీరుతానని చెప్పారు. నందిగ్రామ్ లో మమతను ఓడించిన సువేంధు అధికారిలా తాను గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించి తీరుతానని తెలిపారు.

వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు ఈటల రాజేందర్. తనకు మాటలు వచ్చని.. తన తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంది చిల్లరగా మాట్లాడుతున్న కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు ఛీదరించుకుంటున్నారని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్ కు పట్టబోతుందని అన్నారు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని చెప్పారు. తనకు బానిసలుగా ఉండేవారికే పార్టీలో కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు. తాను ఉద్యమకారుడిని కాబట్టే తప్పులను ప్రశ్నించానని రాజేందర్ అన్నారు. అందుకే తనపై కక్ష కట్టి బయటికి నెట్టేశారని ఆరోపించారు. కావాలనే కేసీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు.

20 ఏళ్ల రాజకీయ చరిత్రలో తన మీద ఏ రాజకీయ పార్టీ నేత కూడా చిల్లర వ్యాఖ్యలు చేయలేదన్నారు. కేసీఆర్ ఎంత దిగజారి వ్యవహరిస్తున్నా తాను స్పందించడం లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, ప్రజలు తనకు సహనాన్ని, ఓపికను ఇచ్చారని రాజేందర్ చెప్పారు. హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కేసీఆర్ ను అక్కడి ప్రజలు బొంద పెట్టారని అన్నారు. గజ్వేల్ లోనూ ఆయనకు బొంద పెట్టడం ఖాయమన్నారు. తనకు కేసీఆర్ బలం, బలహీనత, భయం అన్ని తెలుసన్నారు. గజ్వేలో లో ఏం జరగబోతుందో ప్రజలంతా చూడాలని అన్నారు. కేసీఆర్ వ్యుహం ఎంటో తనకు తెలుసని.. దాన్ని తిప్పికొట్టడం కూడా తెలుసన్నారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు ఈటల రాజేందర్. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్నారు.

Read also: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేసీఆర్ డేట్ ఫిక్స్ చేసేశారా?

Read also: Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News