Almond Milk: బాదం పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుమైన పోషక పదార్ధాలున్నాయి. అయితే పరిమితికి మించి తీసుకుంటే మాత్రం అనర్ధాలు తప్పవంటున్నారు వైద్యులు. ఆ సమస్యలేంటో చూద్దాం..
శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు మన చుట్టూ ఉండే పదార్ధాల్లోనే లభిస్తాయి. అవి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు, పండ్లు కావచ్చు. పోషక పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు ఆహార పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా బాదం పాలు. బాదం పాలలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.
బాదం పాలు లేదా బాదం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్ఠత, బరువు అదుపులో ఉండటం, మానసికంగా సమతుల్యత, గుండె జబ్బులు, కేన్సర్ నియంత్రణలో ఉంటాయి. అదే సమయంలో మితిమీరి తీసుకుంటే మాత్రం చాలా సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ సమస్యలేంటనేది పరిశీలిద్దాం.
బాదంతో దుష్పరిణామాలు
బాదం అధికంగా తీసుకుంటే..ఇందులో ఉండే మినరల్స్, న్యూట్రియంట్స్ అవసరానికి మించితే వాంతులు రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. నట్స్ అలర్జీ ఉన్నవారు బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉంటే మంచిది. ఆవుపాలలో కంటే బాదం పాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ సమస్య ఉన్నవారు మితంగా తీసుకోవాలి.
బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి. బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కల్గించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి.
Also read: Vitamin E Benefits: చర్మ సంరక్షణకు విటమిన్ ఇ ఎంతవరకూ ఉపయోగం, ఏ ఆహారం తినాలి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook