Shimla building collapse: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం పేకమేడలా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సిమ్లా జిల్లాలోని చౌపాల్ (Building Collapsed in Chopal) మార్కెట్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు భవనం కూలిపోయిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సీనియర్ అధికారి తెలిపారు. అయితే భవనం కూలిపోకముందే ఖాళీ చేయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. ఈ భవంతిలో UCO బ్యాంక్ శాఖ, ఒక దాబా, ఒక బార్ మరియు కొన్ని ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి.
రెండో శనివారం కావడంతో.. బ్యాంక్ సెలవు ఉంది. అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన సమయంలో బ్యాంకులో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులలో ఎవరూ లేరని సిమ్లాలోని యూకో బ్యాంక్ జోనల్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రమేశ్ దద్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో నేటి నుండి జూలై 13 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. అంతకుముందు జూలై 6న, హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని మణికరణ్‌లో వరదల ధాటికి ఒకరు మరణించగా... నలుగురు గల్లంతయ్యారు. అదేవిధంగా, కులులోని బాబెలి వద్ద బియాస్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
#WATCH | Himachal Pradesh: A four-storey building collapsed in Chopal town in Shimla amid heavy rainfall. The building was already vacated by the local administration pic.twitter.com/FiJbCLty9r
— ANI (@ANI) July 9, 2022
Also Read: Thunderstorm Video: కారుపై పడిన పిడుగు, ఫ్లోరిడాలో జరిగిన ఘటన, వీడియో వైరల్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook