Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రోజూ తీసుకునే వివిధ రకాల పానీయాలను తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆహారం తీసుకునే క్రమంలో రోజూ ఒక గుడ్డు తీసుకుంటే శరీర సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
గుడ్డులోని పచ్చసొన:
చాలామంది ప్రతి రోజూ గుడ్లు తినడానికి ఇష్టపడతారు. అయితే కొలెస్ట్రాల్‌కు భయపడి చాలా మంది పచ్చసొన తినడం మానేస్తారు. దీనిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతుందని అనుకుంటారు. కానీ WHO, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన అధ్యయనాలు గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంది.
గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, పచ్చసొనలో కొలెస్ట్రాల్, బి విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కావున శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పచ్చ సోన ప్రయోజనాలు:
- గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి అధిక పరిమాణంలో ఉంటుంది.
- దీని నుంచి వచ్చే కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- కొలెస్ట్రాల్ శరీరంలో అనేక సెక్స్ హార్మోన్ల స్రావానికి కూడా సహాయపడుతుంది.
గుడ్డు పచ్చసొనలో ఉండే పోషక విలువలు:
గుడ్డు పచ్చసొనలో అధిక పరిమాణంలో ప్రోటీన్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఒక గుడ్డులో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ప్రోటీన్, కోలిన్, సెలీనియం, జింక్, విటమిన్ A, B, E, D, K కలిగి ఉంటుంది. ఇవి శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.
రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది..?
రోజుకు రెండు గుడ్లలను తినొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇంతకంటే ఎక్కువ గుడ్లు తినాలంటే తెల్ల భాగాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ శరీరానికి మంచిది కాదు. అయితే నూనె లేదా వెన్నలో వేయించి గుడ్లు తినకుండా ఉండడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Horoscope Today July 9th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..
Also Read: Amarnath Cloudburst:15కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook