Hyderabad Rains:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామంతపూర్ లో అత్యధికంగా 71 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మాదాపూర్ లో 5.4 సెంటీమీటర్లు, డబిర్ పురా లో 5.1 సెంటీమీటర్లు, బండ్లగూడలో 4.7 సెంటీమీటర్లు, హఫీజ్ పేటలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీతాఫల్ మండిలో 4.5 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.4 సెంటీమీటర్లు, నారాయణగూడ , హబ్సిగూడలో 4.2 సెంటీమీటర్లు, అంబర్ పేట, ,శ్రీనగర్ కాలనీ, నాంపల్లి, ముషీరాబాద్ లో 4.1 సెంటీమీటర్ల వాన కురిసింది. సికింద్రాబాద్ మొండా మార్కెట్ , ఖైరతాబాద్ లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సాయంత్రం ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ లో చిక్కుకుని రోడ్డుపైనే రెండు, మూడు గంటలు ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. మెహిదీపట్నం మాసబ్ ట్యాంక్, ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్ , రామంతపూర్ , మలక్ పేట్ , సీతాఫల్ మండి లో నీ రోడ్లపై వర్షపు నీరు నిలిచింది.. అనేక రోడ్లపై డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. భారీ వర్షాలు కురవడంతో మాన్ సూన్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సిబ్బంది ఫీల్డ్ లెవెల్ లో ఉండాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు. అయినా చాలా ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కనపించలేదు. పలు ప్రాంతాల్లో పవర్ కట్ కావడంతో రాత్రంతా ప్రజలు అంధకారంలో ఉండిపోయారు.
Read also: నేనూ ఆశ్చర్యపోయా.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అమృత ఫడ్నవీస్ రియాక్షన్..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Hyderabad Rains:హైదరాబాద్ లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పవర్ కట్ తో నరకం..
హైదరాబాద్ లో జోరు వానలు
నగరవ్యాప్తంగా కుండపోత
పలు లోతట్టు ప్రాంతాలు జలమయం