Symptoms of Lymphoma: ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది.. ఈ లక్షణాలుంటే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి..!

Symptoms of Lymphoma: లింఫోమా అనేది ఒక రకమైన భయానకరమైన క్యాన్సర్. ఇది శరీరానికి రక్షణ కలిగించే ఇన్ఫెక్షన్‌ కణాల్లో మొదలై శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ లింఫోమా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని ఇటీవలే పరిశోధనలు పేర్కొన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 11:30 AM IST
  • లింఫోమా అనేది ఒక రకమైన క్యాన్సర్
  • దీనితో బాధపడే వారిలో ఎముకలో నొప్పి వస్తుంది
  • ఆకస్మికంగా బరువు తగ్గుతారు
Symptoms of Lymphoma: ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది.. ఈ లక్షణాలుంటే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి..!

Symptoms of Lymphoma: లింఫోమా అనేది ఒక రకమైన భయానకరమైన క్యాన్సర్. ఇది శరీరానికి రక్షణ కలిగించే ఇన్ఫెక్షన్‌ కణాల్లో మొదలై శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ లింఫోమా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుందని ఇటీవలే పరిశోధనలు పేర్కొన్నాయి. అయితే ఈ వ్యాధి వృద్ధాప్యంలో ఉన్న వారికి వచ్చే అవకాశాలు అధికమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధునిక జీవన శైలికారణంగా యువకుల్లో కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే 60 సంవత్సరాల వారికి మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ లేదా లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు లింఫోమాకు గురయ్యే అవకాశం ఉంది.

లింఫోమా అంటే ఏమిటి.?:

లింఫోమా అంటే ఒకరమైన తెల్లరక్తకణాలలోని జన్యు మార్పుల వల్ల సంభవించే కేన్సర్. శరీరంలో జన్యు మార్పుల నియంత్రణ లేకుంటే ఇది శరీరంలో వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇది బాడీలో నాళము, ప్లీహము, ఎముక మజ్జ, రక్తము భాగల్లో సంభవిస్తుంది. లింఫోమాలో చాలా రకాలున్నాయి.

లింఫోమా వ్యాధి లక్షణాలు:

- లింఫోమా మొదటి లక్షణం శరీరంలో శోషరస కణుపుల వాపు
- శరీరంపై మృదువైన గడ్డలు రావడం
- ఎముకలో నొప్పి
- మెడ, ఛాతీ, చంకలు, పొత్తికడుపుపై చర్మం రంగు మారడం
- అన్ని సమయాలలో అలసిపోవడం
- జ్వరం, దగ్గు
- రాత్రి నిద్రిస్తున్నప్పుడు విపరీతమైన చెమట, దద్దుర్లు
- శ్వాస ఆడకపోవడం
- ఆకస్మికంగా బరువు తగ్గడం
- కడుపులో నొప్పి

ఇలా వ్యాపిస్తుంది:

1. కుటుంబంలో ఏవరైన ఈ సమస్యతో బాధపడుతుంటే.. భవిష్యత్‌లో కూడా పిల్లలు ఈ వ్యాధికి గురికావచ్చు.  
2. హెచ్‌ఐవి ఎయిడ్స్ పాజిటివ్‌ రావడం వల్ల కూడా ఈ వ్యాధి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
3. లింఫోమా అనేది సాధారణ వ్యాధి కాదు. కానీ ఇది చాలా తీవ్రమైన శరీర సమస్య. కాబట్టి పై లక్షణాలతో బాధపడుతుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మేలని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?

Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News