AP, Telangana Weather Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు భారత వాతావారణ విభాగం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరాదిన, దక్షిణాదిన ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. ఓవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడమే భారీ వర్షాలకు కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అక్కడి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. హసన్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Karnataka | Trees uproot as rain lashes several parts of Hassan city, roads blocked pic.twitter.com/I8PtCGysdT
— ANI (@ANI) July 7, 2022
అలాగే తమిళనాడులోనూ ఏపీ, కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఉండనుంది. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
#WATCH | Gujarat: Rising water levels due to heavy rains lead to flood-like situation in Mandvi & Maska area in Kutch pic.twitter.com/408IUxHa21
— ANI (@ANI) July 7, 2022
Also Read : Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే
Also Read : Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook