Lucky Zodiac Of Chaturmas 2022: హిందూమతంలో చాతుర్మాస్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జూలై 10వ తేదీన దేవశయని ఏకాదశి వస్తుంది. ఈ రోజు నుండే చాతుర్మాసం (Chaturmas 2022) ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. వచ్చే నాలుగు నెలల కాలంలో ఐదు రాశులవారు లాభపడనున్నారు.
మేషం (Aries): మేషరాశి వారికి చాతుర్మాసం చాలా శుభప్రదం. వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ రావచ్చు. ధన లాభదాయకంగా ఉంటుంది. శ్రీహరి అనుగ్రహం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. ప్రతిరోజు విష్ణువును పూజించండి.
వృషభం (Taurus): వృషభ రాశి వారికి చాతుర్మాసం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరు వృత్తి-వ్యాపారాలలో బలమైన లాభాలను పొందుతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త పని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ప్రతి గురువారం చాతుర్మాసంలో విష్ణుసహస్రనామం పఠించండి. తులసిని పూజించడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి 4 నెలల చాతుర్మాసం అన్ని విధాలా లాభిస్తుంది. మీరు కెరీర్‌కు సంబంధించి శుభవార్తలను వింటారు. వ్యాపారులు లాభపడతారు. మీరు పిల్లల నుండి సంతోకరమైన వార్తలను అందుకుంటారు. చాతుర్మాసంలో గోవుకు రోటీ తినిపించండి, వీలైతే గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించండి.
కర్కాటకం (Cancer): ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటే..చాతుర్మసం వీరికి ఎన్నో బంఫర్ బెనిఫిట్స్ ఇస్తుంది. వీరి వ్యాపారం లాభాలు బాటలో పయనిస్తుంది. ఆవుకు రోటీ, బెల్లం, పప్పు తినిపించండి.
వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశి వారికి చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. నిరుద్యోగుల కోరిక ఫలించి కొత్త జాబ్ వస్తుంది. ఈ రాశివారికి ఆధాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మంగళవారం బెల్లం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Also Read: Trigrahi Yog: మిథునరాశిలో త్రిగ్రాహి యోగం.. మరో 5 రోజుల్లో ఈ రాశులవారిపై కనకవర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook