Bandi Sanjay: బండి సంజయ్ సంచలనం.. గులాబీలో కలవరం! కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

Bandi Sanjay:  తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు.

Written by - Srisailam | Last Updated : Jul 6, 2022, 02:17 PM IST
  • తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
  • ఆర్టీఐకి బండి సంజయ్ 88 ఫిర్యాదులు
  • కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ హైకమాండ్ యాక్షన్
Bandi Sanjay: బండి సంజయ్ సంచలనం.. గులాబీలో కలవరం! కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

Bandi Sanjay: తెలంగాణ సర్కార్ పై మరింత దూకడు పెంచింది బీజేపీ. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ కొంత కాలంగా ప్రకటనలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా ప్రయోగించారు. సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆర్టీఐకి 88 దరఖాస్తులు చేశారు బండి సంజయ్. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. వైద్య, విద్యాశాఖలకు సంబంధించి సమచారం కూడా కోరారు బండి సంజయ్. ప్రజా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పెద్ద యుద్ధమే సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎనిమిది ఏళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతికి సంబంధించి చిట్టా మొత్తం తమ దగ్గర ఉందని, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. ధమ్ముంటే తమ అవినీతిని బయటపెట్టాలని గులాబీ లీడర్లు కౌంటరిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు ఈ రెండు పార్టీల తీరును ఎండగడుతున్నారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని చెబుతున్న సంజయ్.. ఎందుకు సీబీఐ విచారణ కోవాలని కేంద్రాన్ని అడగడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. కావాలనే డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కేసీఆర్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం భరతం పడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సమావేశాలు ముగిసిన మూడు రోజుల్లోనే టీఆర్ఎస్ సర్కార్ పై బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే సంజయ్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆర్టీఐ నుంచి వచ్చే సమాధానం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. బండి సంజయ్ ఆర్టీఐకి ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారని తెలుస్తోంది.

Also Read: Keeravani: రసూల్ ను దారుణమైన పదంతో ట్రోల్ చేసిన కీరవాణి.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News