Chanakya Niti for Women: ప్రపంచానికి దౌత్యం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలలో అపారమైన జ్ఞానాన్ని అందించిన మేధావి ఆచార్య చాణక్యుడు. జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో చెప్పిన మహానుభావుడు. అంతేకాకుండా లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తన చాణక్యనీతి (Chanakya Niti) ద్వారా తెలియజేసిన ఆధ్యాత్మిక వేత్త. చాణక్యుడు తన గ్రంథంలో స్త్రీలకు ఉండవల్సిన లక్షణాలు గురించి వివరించారు. భర్తతో భార్య ఎలా మెలగాలనే అంశాలను విపులంగా తెలియజేశారు.
చాణక్య నీతిలో పేర్కొన్న స్త్రీల లక్షణాలు:
>> భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుంది. అలాంటి భార్య సాంగత్యం భర్త జీవితాన్నే మార్చేస్తుంది. అతడు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడు.
>> భర్తకు డబ్బు లేనప్పుడు, గౌరవం లేనప్పుడు, అతనిని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి అర్ధాంగిని భర్త గౌరవించాలి. ఇలాంటి వైఫ్ అదృష్టం ఉన్న వ్యక్తులకు మాత్రమే దొరుకుతుంది.
>> భార్య ప్రవర్తన సరిగా లేకుంటే... ఆమె కుటుంబ పరువు మెుత్తం పోతుంది. అలాంటప్పుడు భార్యను విడిచిపెట్టడం మంచిదని చాణక్య నీతిలో చెప్పబడింది. తప్పుడు స్త్రీ సహవాసం మంచి జీవితాన్ని నాశనం చేస్తుంది.
>> భార్య అసహనంతో మరియు సంస్కారహీనంగా ఉంటే... ఆ కుటుంబాన్ని నాశనం అవ్వడం పక్కా. అలాంటి కుటుంబంలో ఎప్పుడూ శాంతి, సంతోషాలు ఉండవు.
Also Read: Masik Durgashtami 2022: మాస/మాసిక్ దుర్గాష్టమి ఎప్పడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి