Ashadha Gupt Navratri 2022: ప్రతీ ఏటా నాలుగు సార్లు దుర్గా నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో రెండు శారదియ, చైత్ర నవరాత్రులు. దేశవ్యాప్తంగా వీటిని వైభవంగా జరుపుకుంటారు. మరో రెండు మాఘం, ఆషాఢంలో వచ్చే గుప్త నవరాత్రులు. ఈసారి ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు జూన్ 30 నుంచి ప్రారంభమవుతున్నాయి. గుప్త నవరాత్రులలో తంత్ర-మంత్ర అభ్యాసం కోసం ధ్యానం చేయబడుతుంది. గుప్త నవరాత్రుల రోజుల్లో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
గుప్త నవరాత్రులలో చేయాల్సినవి.. చేయకూడనివి.. :
గుప్త నవరాత్రుల రోజుల్లో దుర్గా మాతను పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం, ఉపవాసం పాటిస్తారు.
గుప్త నవరాత్రులలో తామసిక ఆహారాన్ని భుజించవద్దు. అంటే మసాలా వంటలు, మాంసాహారం వంటివి తీసుకోవద్దు. ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను చేర్చవద్దు. పూర్తిగా సాత్విక ఆహారమే తీసుకోవాలి.
నవరాత్రుల్లో రాత్రిపూట మంచంపై నిద్రించవద్దు. నేలపై చాప వేసుకుని పడుకోవాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.
భక్తి శ్రద్ధలతో, మనసును దైవంపై ఉంచి చిత్తశుద్ధితో దుర్గాదేవిని పూజించాలి.
తల్లిదండ్రులకు సేవ చేయండి.. వారి పట్ల ప్రేమతో, గౌరవంతో మెలగండి.
గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత
దుర్గా దేవి గుప్త నవరాత్రులలో తంత్ర-మంత్రం, మంత్రవిద్య, వశీకరణం మొదలైనవాటి సాధన కోసం ధ్యానం చేయబడుతుంది. అదే సమయంలో దుర్గాదేవి భక్తుల కఠోర తపస్సుకు, భక్తికి సంతోషించి భక్తుల కోర్కెలు నెరవేరుస్తుంది.
తొమ్మిది రూపాల్లో దుర్గా మాత :
గుప్త నవరాత్రుల్లో దుర్గా దేవి తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తుంది. దుర్గాదేవి, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి మాతలుగా దుర్గా దేవి దర్శనమిస్తుంది. గుప్త నవరాత్రులలో తారా, త్రిపుర సుందరి, భునేశ్వరి, ఛిన్మస్తా, కాళీ, త్రిపుర భైరవి, ధూమావతి, బగ్లాముఖి మాతలను కూడా పూజిస్తారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: దీపక్ హుడా అరుదైన రికార్డు.. నాలుగో ప్లేయర్‌గా..! కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు
Also Read: JioPhone Next Price: స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే.. నెలకు రూ.219 ఈఎంఐతో మీ సొంతం చేసుకోవచ్చు..