Tomato Juice Benefits: టమోటాలు ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కృషి చేస్తాయి. ఇందులో కాల్షియం, విటమిన్లు, భాస్వరం వంటి పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇందులో లైకోపీన్ పిలువబడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. అంతేకాకుండా టమోటా జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఈ జ్యూస్ వల్ల శరీరాని అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటో జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంపొందింస్తుంది:
టమాటోలో విటమిన్ల అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే బీటా-కెరోటిన్, లైకోపీన్, విటమిన్-ఇ, మొదలైనవి ఇందులో ఉంటాయి. కావున ఇది ఫ్రీ రాడికల్స్ ను కూడా నివారిస్తుంది.
బరువును నియంత్రింస్తుంది:
టొమాటో జ్యూస్ తాగడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడంలో చాలా ఎఫెక్టివ్ గా టమాటో జ్యూస్ పని చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ:
టమాటో జ్యూస్ గుండెకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్ లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా శాస్త్రం పరిగణించింది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, కొవ్వు వంటి సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం కొరకు:
మంచి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలనుకుంటే.. టమోటా జ్యూస్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ టమాటో జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడ్డ సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి