Chaturmas 2022: త్వరలో ప్రారంభంకానున్న చాతుర్మాసం... ఈ విషయాలు తెలుసుకోకపోతే మీకే నష్టం!

Chaturmas 2022: చాతుర్మాసం ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. సనాతన ధర్మం ప్రకారం, చాతుర్మాసం నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 04:11 PM IST
  • ఆషాఢమాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభం
  • ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం
Chaturmas 2022: త్వరలో ప్రారంభంకానున్న చాతుర్మాసం... ఈ విషయాలు తెలుసుకోకపోతే మీకే నష్టం!

Chaturmas 2022 Rules:  చాతుర్మాసం ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆషాఢమాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి నుంచి చాతుర్మాసం (Chaturmas 2022) ప్రారంభమవుతుంది. ఈ రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి 4 నెలల తర్వాత మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని 'చాతుర్మాసం లేదా చౌమాసం' అంటారు. చాతుర్మాసం.. దేవశయని ఏకాదశి నుండి మొదలై శ్రావణ, భాద్రపద, అశ్విని నుండి కార్తీక మాసం వరకు ఉంటుంది. ఈ సంవత్సరం చాతుర్మాస్ జూలై 10న ప్రారంభమై నవంబర్ 4న ముగుస్తుంది. 

చాతుర్మాసం మొదటి మాసం సావన మాసం. ఇది శివునికి అంకితం చేయబడింది. సావన మాసంలోని అన్ని సోమవారాల్లో ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేస్తారు. దీంతో పాటు చాతుర్మాసంలో కొన్ని నియమాలు పాటించాలి. లేని పక్షంలో మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాతుర్మాస్ సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆ ఆహారాన్ని తీసుకోవద్దు: చాతుర్మాస్ సమయంలో వాతావరణంలో మార్పు కారణంగా, ప్రజల జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఈ కారణంగా ఈ 4 నెలల్లో వేయించిన మరియు మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అలాగే పొరపాటున నాన్ వెజ్, ఆల్కహాల్ తీసుకోవద్దు. ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. అలాగే చాతుర్మాసంలో బెండకాయ, పాలు, పంచదార, పెరుగు, నూనె, ఆకు కూరలు, ముల్లంగి, బెల్లం, తేనె మొదలైన వాటిని తినడం నిషేధం. 

రోజుకి ఒక్కసారే భోజనం చేయండి: చాతుర్మాసంలో ఒక్కసారే భోజనం చేయాలని సనాతన ధర్మంలో చెప్పబడింది. అవసరమైతే, మీరు ఒకసారి పండు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

వేడి నీరు త్రాగండి: ఈ 4 నెలల్లో అపరిశుభ్రమైన నీటి వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి నీటిని మరిగించి వడగట్టిన తర్వాత త్రాగాలి. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.

Also Read: Astrology: ఈ రాశుల వారు ప్రేమించినంత ఈజీగా బ్రేకప్ చెప్తారు! అందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News