BREAKING: Basara IIIT Students: బాసర త్రిపుల్ ఐటికి మంత్రి సబిత.. సమ్మె విరమించినట్టు ప్రకటించిన విద్యార్థులు

Minister Sabitha Indra Reddy Meets Basara IIIT Students: బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Jun 21, 2022, 03:02 AM IST
  • బాసర త్రిపుల్ ఐటికి మంత్రి సబిత ఇంద్రా రెడ్డి
  • విద్యార్థులతో సమ్మె విరమింపజేసేందుకు చర్చలు
  • మంత్రి సబితతో విద్యార్థులు ఏమన్నారంటే...
BREAKING: Basara IIIT Students: బాసర త్రిపుల్ ఐటికి మంత్రి సబిత.. సమ్మె విరమించినట్టు ప్రకటించిన విద్యార్థులు

Minister Sabitha Indra Reddy Meets Basara IIIT Students: బాసర ఐఐఐటిలో గత ఏడు రోజులుగా చేపట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. సోమవారం రాత్రి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఉన్నత విద్యామండలికి చెందిన ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బాసర త్రిపుల్ ఐటి క్యాంపస్‌కి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అన్నింటినీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు ఏకరువు పెట్టిన విద్యార్థులు.. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో తమ ఆందోళనను విరమించుకుంటున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. రేపు మంగళవారం నుండే తరగతులకు హాజరవుతామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. 

భారీ వర్షంలో క్యాంపస్‌కి చేరుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. క్యాంపస్ వద్ద భారీ హంగామా..
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాత్రి 10 గంటల ప్రాంతంలో బాసర త్రిపుల్ ఐటి క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. మంత్రి సబిత క్యాంపస్‌కి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాల హడావుడితో క్యాంపస్ పరిసరాలలో భారీ హంగామా కనిపించింది. వర్షంలోనే క్యాంపస్‌కి చేరుకున్న సబితా ఇంద్రారెడ్డి.. నేరుగా సమావేశ మందిరంలోకి వెళ్లి విద్యార్థులతో సమావేశమయ్యారు. 

ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్లండి.. మంత్రికి విద్యార్థుల విజ్ఞప్తి..
విద్యార్థులతో సమావేశం సందర్భంగా పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన మంత్రి సబితతో పాటు ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీకి, జిల్లా ఎస్పీకి విద్యార్థులు ధన్యావాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు మంత్రి సబితతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిని మన్నించి ఈ రాత్రికి ఇక్కడే క్యాంపస్‌లో బస చేసి రేపు ఉదయం విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, విద్యార్థుల విజ్ఞప్తిని సున్నితంగానే తిరస్కరించిన మంత్రి సబిత (Minister Sabitha Indra Reddy).. మరో నెల రోజులకు వచ్చి మీ అందరితో కలిసి లంచ్ చేసి వెళ్తానని హామీ ఇచ్చారు.

Also read : Hyderabad Weather Updates : నగరం నలుమూలలా భారీ వర్షం.. తడిసి ముద్దయిన హైదరాబాద్

Also read : Basara IIIT: సీఎం నుంచి లేఖ వస్తేనే కదిలేది! బాసరలో ఏడవ రోజు అదే ఉద్రిక్తత.. కేసీఆర్ కు సంజయ్ లేఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Linkhttps://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News