Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!

Agnipath Protest Case: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.  ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్రపై ఆరా తీస్తున్నారు. 

Written by - Alla Swamy | Last Updated : Jun 20, 2022, 04:11 PM IST
  • సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో విచారణ వేగవంతం
  • కోచింగ్ సెంటర్ల పాత్రపై ఆరా
  • నిరసనకారులతో తల్లిదండ్రుల ములాఖత్‌
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల  స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!

Agnipath Protest Case: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.  ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్రపై ఆరా తీస్తున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బరావును ఏపీ పోలీసులు విచారిస్తున్నారు. విధ్యంసానికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లో చాటింగ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. 

వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డింగ్స్, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. విధ్వంసం వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నారు. ఈకేసులో మొత్తం 16 కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని రైల్వే పోలీసులు తేల్చారు. ఈకేసును హైదరాబాద్‌ పోలీసులకు బదలాయించారు.  ఆందోళనకారుల ఆరు వాట్సాప్‌ గ్రూప్‌లను గుర్తించారు. విధ్వంసం కేసులో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. 

మరోవైపు సికింద్రాబాద్ అల్లర్లకు..తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు నిందితుల తల్లిదండ్రులు. వెంటనే వారిని విడుదల చేయాలంటున్నారు. చంచల్‌గూడ్‌ జైలు ప్రాంగణమంతా ఆందోళనకారుల తల్లిదండ్రులతో నిండిపోయింది. జైలులో ఉన్న తమ పిల్లలతో తల్లిదండ్రులు ములాఖత్‌ అవుతున్నారు. ఇప్పటివరకు ములాఖత్‌ కోసం 300 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈకేసులో ఇప్పటివరకు 46 మందిని పోలీసులు అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు.

Also read:Irfan Pathan on Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ను ముందు సంధించండి..ఆ తర్వాతే ఆలోచించాలన్న పఠాన్..!

Also read:CM KCR Wife: సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత.. యశోద హాస్పిటట్‌లో చేరిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News