Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్మెంట్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈక్రమంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని 5 వందల రైళ్లను రద్దు చేసింది. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. 500 రైళ్లలో 181 ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు కాగా..348 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని తెలిపింది. మిగిలిన నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆరు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. రద్దు అయిన రైళ్లల్లో 71 ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించేవే ఉన్నాయి.
గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు కొనసాగుతున్నాయి. తెలంగాణ,బీహార్, యూపీ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. పలు రైల్వే స్టేషన్ల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో నిఘాను రెట్టింపు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు గాంధీ కుటుంబసభ్యులను ఈడీ విచారించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఉద్రిక్త వాతావరణ కనిపించింది. వీటిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసింది.
Also read:Mens Health: పురుషుల్లో పెరుగుతున్న టెస్టోస్టెరాన్ సమస్యలు.. ఇలా సులభంగా విముక్తి పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook