Spice Jet Flight: స్పైస్ జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి విమానం బయలు దేరింది. ఈక్రమంలోనే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమ ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారి మంటలు చెలరేగాయి.
#WATCH Patna-Delhi SpiceJet flight safely lands at Patna airport after catching fire mid-air, all 185 passengers safe#Bihar pic.twitter.com/vpnoXXxv3m
— ANI (@ANI) June 19, 2022
అప్రమత్తమైన పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమామాన్ని వెంటనే పాట్నా ఎయిర్‌పోర్టులో తిరిగి ల్యాండ్ చేశారు. అంతకముందే ఇంజిన్‌కు మంటలు వ్యాపించే విషయాన్ని పసిగట్టిన పైలెట్లు ఇంధన సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురైయ్యారు. సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు.
#WATCH Delhi bound SpiceJet flight returns to Patna airport after reporting technical glitch which prompted fire in the aircraft; All passengers safely rescued pic.twitter.com/Vvsvq5yeVJ
— ANI (@ANI) June 19, 2022
ఇందులో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విమానంలో మంటలను స్థానికులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారని పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also read:Agnipath: అగ్నిపథ్ ద్వారానే ఆర్మీ రిక్రూట్మెంట్..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook