Agnipath Protests: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో అట్టుడికిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 10 గంటల పాటు కొనసాగాయి ఆందోళనలు. రైల్వే ఉన్నతాధికారులు చర్చలకు పిలిచినా నిరసనకారులు రాలేదు. దీంతో ఆరున్నర గంటల సమయంలో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టీఎస్ఎస్పీ , టాస్క్ ఫోర్స్, RPF పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో రైల్వే స్టేషన్ లోని పట్టాలపై ఉన్న అభ్యర్థులు పరుగులు తీశారు. 5 నిమిషాల వ్యవధిలోనే వందల మంది ఆందోళన కారులను చెదరగొట్టారు పోలీసులు. దాదాపు 40 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మిగితా వారు స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోయారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల పూర్తిగా పరిస్థితి అదుపులోకి రావడంతో ట్రాక్ లతో పాటు, బోగిలను శుభ్రం చేశారు సిబ్బంది. రైళ్లను పునరుద్దరించారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి మొదటి రైలు బయలుదేరింది. లింగంపల్లి నుంచి కాకినాడకు రైళ్లు వెళ్లింది. రాత్రి షెడ్యూల్ ఉన్న అన్ని రైళ్లను పునరుద్దరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్ లో భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. నడిచే రైళ్లలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి కేసు నమోదు చేశారు రైల్వే పోలీసులు. సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 తో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు. రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.ఇంకా కేసు దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదన్నారు. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదన్నారు. పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అనురాధ వెల్లడించారు.
Read also : Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి
Read also : Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8 వేల పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Agnipath Protests: సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణ.. అల్లర్లపై కేసు నమోదు
10 గంటల తర్వాత సద్దుమణిగిన టెన్షన్
సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణ
అల్లర్లపై కేసు నమోదు