Tulsi Uses And Benefits: ఇంట్లో తులసి మొక్క ఉండటం హిందూ మతంలో శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ మొక్కలో స్వయంగా మా లక్ష్మి ఉంటుందని హిందువులు భావిస్తారు. ప్రతి పండగకు తులసిని పూజించడం హిందు సాంప్రదాయం. ముఖ్యంగా విష్ణువు ఆరాధన సమయంలో తులసిని తప్పకుండా పూజిస్తారని శాస్త్రం చెబుతోంది. వాతవరణ పరిస్థితుల వల్ల తులసి వాడిపోతుంది. అయితే ఇలా వాడిపోవడం లేదా ఎండి పోవడం శుభపరిణామం కాదని పలు హిందూ శాస్త్రాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో సమస్యలకు దారి తీసే సంకేతంగా భావించవచ్చని శాస్త్రం చెబుతోంది. తులసిని పచ్చగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
పచ్చి పాలు:
తులసి మొక్క ఎండిపోకుండా కాపాడటానికి.. నీటిలో పచ్చి పాలు కలిపి మొక్కకు నీరు పోయాలి. పాలు నేలలో తేమను ఎక్కువ కాలం ఉంచి.. మొక్కకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా మొక్కను నాటేటప్పుడు కుండీ అడుగు భాగాన కొబ్బరి పీచు వేసి దాని పైన మట్టితో మొక్కను నాటడం వల్ల తేమ ఎక్కువ కాలం ఉంటుంది.
పాత ఆకులు:
తులసి మొక్క ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే దాని పాత ఆకులను తీసీవేయండి. మొక్క పైభాగం నుంచి ఆకులను తీయకండి. చిగురును ఏ మాత్రం తీయకండి. తీస్తే తులసి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. మండుతున్న ఎండ నుంచి తులసిని రక్షించడానికి.. శుభ్రమైన ఆకుపచ్చ గుడ్డని కప్పండి. ఆకుపచ్చ రంగు మండే వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
Also Read: High Cholesterol: ఈ 4 లక్షణాలు కొలెస్ట్రాల్ పెరిగుదలను సూచిస్తాయి..ఇవి పెరిగితే గుండెపోటు తప్పదు.!!
Also Read: Hands Symptoms: ఈ లక్షణాలు గోళ్లలో కనిపిస్తే ప్రమాదమే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook