Gayatri Mantra: గాయత్రీ మంత్రం అర్థం, దాని ప్రాముఖ్యత తెలుసా?

Gayatri Mantra:  గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనస్సు మరియు శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మంత్రాన్ని పఠించడం అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2022, 10:50 AM IST
Gayatri Mantra: గాయత్రీ మంత్రం అర్థం, దాని ప్రాముఖ్యత తెలుసా?

Gayatri Mantra  Significance:  హిందూమతంలో గాయత్రీ మంత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషం ఉంటుందని నమ్ముతారు. గాయత్రీ మంత్రం (Gayatri Mantra) మొదటిసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఈ మంత్రం 2500 నుండి 3500 సంవత్సరాల క్రితం సంస్కృతంలో వ్రాయబడింది. గాయత్రీ మంత్రం యొక్క అర్థం మరియు దానిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

గాయత్రీ మంత్రం అర్థం
'ఓం భూర్భవ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్'. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే.. 'మేము దైవిక జీవి, సృష్టికర్త యొక్క ప్రకాశాన్ని ధ్యానిస్తాము. ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది'. మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం చేయబడింది. మా గాయత్రిని వేదాల తల్లి అని కూడా అంటారు. ఈ మంత్రానికి హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంది మరియు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిని జపిస్తారు. గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని గ్రంధాలలో వ్రాయబడింది. మీరు ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం మూడుసార్లు జపించవచ్చు. దీనినే త్రికాల సంధ్య అంటారు. 

గాయత్రీ మంత్రం ప్రయోజనాలు
>> ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయం మరియు ఆనందం లభిస్తాయని నమ్ముతారు.
>> గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రం మన మేధస్సును పదునుగా చేస్తుంది.
>> ఏకాగ్రతను కాపాడుకోవడానికి ఈ మంత్రాన్ని జపించాలి.
>> ఈ మంత్రాన్ని పఠించడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. ఇది కాకుండా, ఇది నాడీ వ్యవస్థ యొక్క శ్వాస మరియు పనితీరులో సహాయపడుతుంది.
>> ఈ మంత్రం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది.

Also Read: Sun Transit Effect: మిథునరాశిలో సూర్య సంచారం... ఈ రాశుల వారు జాగ్రత్త..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News