Thief Escape: పోలీసుల నిర్లక్ష్యాన్ని ఓ దొంగ తనకు అవకాశంగా మలుచుకున్నాడు. అప్పటివరకు స్టేషన్ లోనే ఉన్న ఆ దొంగ రెప్పపాటులో మాయం అయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ చోరి కేసులో విచారణ కోసం బయ్యారం పోలీసులు పాత నేరస్థుడైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. రాజు ను విచారిస్తున్న సమయంలో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారీ అయ్యాడు.
దొంగ కోసం ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు వాట్సాప్ గ్రూప్ ల్లో దొంగ ఫోటోను సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. దొంగను పట్టిస్తే పది వేల రూపాయల బహుమానం ఇస్తామని వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేశారు. అప్పటివరకు గోప్యంగా ఉన్న విషయం కాస్త బహిర్గతమైంది. రాజు కనిపిస్తే 9963646986, 8374524977 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
గతంలో రాజు సబ్ జైలు నుంచి కూడా పారిపోయాడు. పోలీసులు రాత్రి వేళల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే పోలీస్ స్టేషన్ నుంచి సులువుగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. బయ్యారం పోలీస్ స్టేషన్ ఇటీవలే నూతనంగా నిర్మించిన భవనంలోకి మారింది. పాత భవనం లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, నూతన భవనంలోకి మారిన తరువాతనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
విచారణ కోసం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చిన ఓ పాత నేరస్థుడు శానిటైజర్ తాగడం ... అతడే మరోసారి గాజు ముక్కలు మింగడం కలకలం సృష్టించింది. ఈ సంఘటనలు జరిగి 15 రోజులు గడవక ముందే మరో పాత నేరస్తుడు పారిపోవడం పోలీసుల అజాగ్రత్త కు నిదర్శనంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Also Read: AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో సాధారణ బదిలీలు..!
Also Read: TS CPGET-2022: తెలంగాణలో సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ షురూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook